సంత్ నిరంకారీ మిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
16 నవంబర్ 2014 న న్యూ ఢిల్లీలోని నిరంకరీ కాలనీలో సంత్ నిరంకారి సత్సంగ్ భవన్

సంత్ నిరంకారీ మిషన్ భారతదేశంలోని పంజాబ్ లో మొదలయిన ఒక ఆధ్యాత్మిక/ధార్మిక సంస్థ. సంస్థవాళ్ళు చెప్పుకునే ప్రకారం ఇది "ఒక కొత్త మతమో లేక ఉన్న మతాల కొత్త ఉపమతమో కాదనీ, అన్ని మతాలను మానవ కల్యాణార్ధం కలుపుకోయే సంస్థ " అని. పండితుల ప్రకారం ఇది సిక్కుల మతం నుండి పుట్టుకొచ్చిన ఉపమతం, 1929 లో ముఖ్య మతం నుండి వేరుపడింది.పేరులో సామ్యత ఉన్నప్పటికీ ఈ సంస్థకు బాబా దయాల్ మొదలుపెట్టిన నిరంకారీ ఉద్యమంతో సంబంధం లేదు. ఈ సంస్థ అనుయాయులపై పదే పదే సాంప్రదాయ సిక్కులు దాడులు చేస్తూ వీరిని సిక్కులకు ద్రోహులుగా చిత్రీకరించారు. సంత్ నిరంకారీ మిషన్ కు భారతదేశం వెలుపల 100 వరకూ బ్రాంచీలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్, ఉత్తర అమెరికాలలో. మిషన్ ముఖ్య కేంద్రం ఢిల్లీలోని సంత్ నిరంకారీ కాలనీలో ఉంది. దీని ముఖ్య అధిపతి బాబా హర్దేవ్ సింగ్ నిరంకారీ మిషన్ అనుయాయులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తారు. ఈయనే ఈ సంస్థకు నాయకుడు, జీవిత సద్గురువు అని ఈ మతానుయాయులు నమ్ముతారు.[1]

చరిత్ర[మార్చు]

బాబా దయాల్ నాయకత్వంలో నిరంకారీ మిషన్ (ఇప్పుడిది అచేతనంగా ఉంది) 19వ శతాబ్ది మొదట్లో మొదలయింది. సిక్కుల నమ్మకం ప్రకారం గురు గోవింద్ సింగ్ ఆఖరి గురువు, ఆయన తరువాత గురువు ఉండడు అనీ, మత గ్రంథం పై నమ్మకమే గురువు అని నమ్మటం మొదలుపెట్టారు. కానీ నిరంకారీ ఉద్యమం దీనికి విరుద్ధంగా సజీవ గురువులో నమ్మకం ఉంచడం మొదలుపెట్టింది. సిక్కులు ఈ ఉద్యమం పరిమాణం తక్కువ ఉండటం వలన మొదట్లో పట్టించుకోలేదు. కానీ 1929లో ఈ ఉద్యమం నుండి సంత్ నిరంకారీ అనే సంస్థ పుట్టుకొచ్చింది. ఇది సాంప్రదాయ సిక్కుల నమ్మకానికి విరుద్ధంగా స్థాపించబడింది.1960ల్లో ఈ సంస్థ పెరుగుతూ వచ్చి సాంప్రదాయ సిక్కు మతగురువుల సహనానికి పరీక్షగా మారింది. అందువలన సిక్కుల ద్వారా నిరంకారీల పై హింసాత్మక దాడులు మొదలయ్యాయి. 1980లో సంత్ నిరంకారీ గురువయిన గుర్బచన్ సింగ్ చంపివేయబడ్డాడు. ఇతనిని చంపిన వ్యక్తి అఖండ్ కీర్తని జాత్థా సభ్యుడయిన రంజీత్ సింగ్.

అవతార్ బాణీ[మార్చు]

అవ్తార్ బాణీ సంత్ నిరంకారీ మిషన్ సిద్ధాంతాలను పొందుపరిచిన ప్రాథమిక గ్రంథము. ఈ మతానికి చెందిన ఒక మతగురువయిన షెహెన్షాహ్ బాబా అవ్తార్ సింగ్ పేరు మీద ఈ పుస్తకానికి నామకరణం జరిగింది. 1957లో మొదటి ప్రతి ప్రచురించబడింది. ఆ పైన 1965లో సంపూర్ణ అవ్తార్ బాణీ వెలువడింది. ఈ పుస్తకంలో మొత్తం కలిపి 376 పద్యాలు ఉన్నాయి. చాలా వరకు పంజాబీలో, కొన్ని ఉర్దూ, సింధీలో కలవు. ఇందులో భగవంతుని చేరుకునే మార్గం గురించి వివరించబడి ఉంది. సరియైన సద్గురువు గుణాలు, విశేషాలు వివరించబడి ఉన్నాయి. ఆకారం లేని దేవుణ్ణి (నిరాకారుడు) నమ్మటమే ఈ మతం. ఈ పుస్తకం గురుముఖీ, దేవనాగరీ, ఉర్దూ, రోమన్ లిపులలో ప్రచురించబడింది. తరువాతి కాలంలో ఆంగ్లంలోకీ, హిందీ, బాంగ్లా, అరవం, గుజరాతీ, తెలుగు, నేపాలి, మరాఠీలోకి అనువదించబడి ఉంది.

వీరి ఆచార వ్యవహారాలు హిందూ విశ్వాసములకు వ్యతిరేకంగా( విగ్రహారాధనకు వ్యతిరేకం ) & ఇస్లాం పద్దతికి దగ్గరగా( బొట్టు లేకుండా & hijab తో) ఉంటున్నాయి.

నిరంకారీ సంగ్రహాలయం[మార్చు]

22 ఫిబ్రవరీ 2005 న బాబా హర్దేవ్ సింగ్ ద్వారా ఇది అధికారికంగా మొదలుకాబడింది. ఈ సంగ్రహాలయం సంత్ నిరంకారీ సరోవర్ ఉత్తర ఢిల్లీలో ఉంది. నిరంకారీ మిషన్ కు సంబంధించిన చారిత్రను దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా చూపించబడి ఉంది.

నిరంకారీ సంత్ సమాగం[మార్చు]

ఇది వివిధ ప్రదేశాల్లో సంవత్సరంలోని వివిధ రోజుల్లో నిర్వహించబడుతుంది.

మూలాలు[మార్చు]

  1. "All about the Sant Nirankari Mission". Zee News (in ఇంగ్లీష్). 18 May 2016. Retrieved 27 December 2023.

వెలుపలి లంకెలు[మార్చు]