సంధ్యారాగం (1981 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంధ్యారాగం
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.ఎన్.రామచంద్రరావు
నిర్మాణం వై.శ్రిదేవి
కథ గిరి బాబు
తారాగణం శరత్ బాబు, ప్రభ, గిరిబాబు
సంగీతం రమేష్ నాయుడు
గీతరచన అప్పలచార్య
సంభాషణలు అప్పలచార్య
కూర్పు కంద స్వామి
భాష తెలుగు

సంధ్యారాగం 1981 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. మాధవి చిత్ర పతాకంపై వై.శ్రిదేవి నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. గిరిబాబు సమర్పించిన ఈ సినిమాలో శరత్ బాబు, ప్రభ, గిరిబాబులు ప్రధాన తారాగణంగా నటించగా రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: గిరి బాబు
  • సంభాషణలు, సాహిత్యం: అప్పలచార్య
  • ఛాయాగ్రహణం: విజయ్ కుమార్
  • ఎడిటింగ్: కంద స్వామి
  • కళ: రంగారావు
  • ప్రెజెంటర్: గిరి బాబు
  • నిర్మాత: వై.శ్రీదేవి
  • దర్శకుడు: పి.ఎన్.రామచంద్రరావు
  • బ్యానర్: మాధవీ చిత్ర

కుటుంబపోషణ కోసం చదువుకున్న గీత ఉద్యోగం కోసం పట్నం చేరుతుంది. అక్కడ గిరి వలలో పడి మోసపోయి ఆఖరుకు వ్యభిచార గృహంలో అమ్ముడుపోతుంది. అక్కడ మనశ్శాంతికై చేరిన కోటీశ్వరుని ఆకట్టుకుని అతని ఇంటికి 'తాళి కట్టని ఆలి'గా చేరుతుంది. తీరా చూస్తే ఆ కోటీశ్వరుని కొడుకు కళ్యాణ్, గీత గతంలో పేమించుకున్నవారే అవుతారు. అటు తండ్రివద్ద ఆలిగా ఉంటూ, ఇటు తనయుని వద్ద ప్రియురాలిగా గీత పడే ఆవేదన, ఆ రెండు పరిస్థుతులలో ఆమె పడే సంఘర్షణ తరువాతి కథ.[2]


పాటల జాబితా

[మార్చు]

1.ఆనందం మనతో పరవశించి, రచన: అప్పలాచార్య, గానం.పులపాక సుశీల

2.తెలిసేది నాకిపుడు అమ్మా అని , రచన:అప్పలాచార్య, గానం.పి .సుశీల

3.చితికెక్కినవి రెండు జీవితాలు , రచన: అప్పలాచార్య, గానం.పి.రమేష్ నాయుడు కోరస్

వందేనీల సరోజ కోమల రుచిం (శ్లోకం) రచన: అప్పలాచార్య, గానం.పి. సుశీల .

మూలాలు

[మార్చు]
  1. "Sandhya Ragam (1981)". Indiancine.ma. Retrieved 2021-05-26.
  2. పాలకోడేటి (30 August 1981). "సంధ్యారాగం - సినిమా రివ్యూ". సితార: 16. Retrieved 16 November 2022.

. 3. ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]