Jump to content

సంభాజీ పాటిల్

వికీపీడియా నుండి
సంభాజీ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013 - 2018
ముందు అభయ్ పాటిల్
తరువాత అభయ్ పాటిల్
నియోజకవర్గం బెల్గాం దక్షిణ

వ్యక్తిగత వివరాలు

జననం 1951
బెల్గాం, భారతదేశం
మరణం 2019 మే 17
బెల్గాం, భారతదేశం
రాజకీయ పార్టీ ఎంఈఎస్

సంభాజీ లక్ష్మణ్ పాటిల్‌ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బెల్గాం దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగుసార్లు బెలగావి సిటీ కార్పొరేషన్‌ మేయర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సంభాజీ పాటిల్ మహారాష్ట్ర ఏకీకరణ సమితి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 1991, 1992, 1993, 2003లో బెలగావి సిటీ కార్పొరేషన్‌ మేయర్‌గా పని చేసి ఎంఈఎస్ నాయకులతో విభేదించి 2003లో పార్టీని వీడి ఆ తరువాత కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలలో పని చేసి దశాబ్దం తర్వాత తిరిగి ఎంఈఎస్లో చేరి 2013 శాసనసభ ఎన్నికలలో బెల్గాం దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఈఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అభయ్ పాటిల్‌పై 6310 ఓట్ల గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మరణం

[మార్చు]

సంభాజీ పాటిల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2019 మే 17న మరణించాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
  2. The Hindu (18 May 2019). "Sambhaji Patil passes away" (in Indian English). Archived from the original on 7 November 2020. Retrieved 19 November 2024.
  3. "Former MLA Sambhaji Patil passes away". 18 May 2019. Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.
  4. The Times of India (19 May 2019). "Belagavi: Sambhaji Patil's daughter raises doubts about his death". Archived from the original on 25 September 2022. Retrieved 19 November 2024.