సంయోజకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చాలా ప్రవచనాలు కొన్ని సరళమైన ప్రవచనాలను కొన్ని ప్రత్యేక పదాలతో అనుసంధానం చేయడం వల్ల ఏర్పడేవే, ఇలా అనుసంధానం చేసే పదాలను సంయోజకాలు అంటారు. ఈ సంయోజకాలతో సరళ ప్రవచనాలను అనుసంధానం చేయడం వల్ల ఏర్పడే ప్రవచనాలను సంయుక్త ప్రవచనాలు అంటారు.

ఉదాహరణలు :

p : 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్నీ బేసిసంఖ్యలే.

r : 2 ఒక సరిప్రధాన సంఖ్య.

ఈ రెండు ప్రవచనాలను ఉపయోగించి రకరకాల సంయుక్త ప్రవచనాలను తయారు చేయవచ్చు. మచ్చుకు కొన్ని.

(i) 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్నీ బేసిసంఖ్యలే, 2 ఒక సరిప్రధాన సంఖ్య. అనగా p, q

(ii) 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే లేదా 2 ఒక సరి ప్రధాన సంఖ్య అనగా p లేదా q

(iii) 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్ని బేసి సంఖ్యలయినపుడు 2 ఒక సరిప్రధాన సంఖ్య అవుతుంది. అనగా p అయినపుడు q అవుతుంది.

(iv) 2 తప్ప మిగత ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్య లే అయినపుడు కేవలం అలా అయినపుడు మాత్రమే 2 ఒక సరి ప్రధాన సంఖ్య అవుతుంది.

i.e., p అయినపుడు కేవలం అలా అయినపుడు మాత్రమే q అవుతుంది.

(v) 2 ఒక సరిప్రధాన సంఖ్య అనునది నిజం కాదు.