సఖిగోపాల్ ఆలయం
సఖిగోపాల్ ఆలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశము |
రాష్ట్రం: | ఒడిశా |
ప్రదేశం: | పూరి, భువనేశ్వర్ రహదారి లో ఉన్న సఖిగోపాల్ పట్టణం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కళింగ నిర్మాణ శైలి |
సఖిగోపాల్ ఆలయం ఒడిశా రాష్ట్రం పూరి, భువనేశ్వర్ ల మధ్య రహదారిలో సఖిగోపాల్ అనే ఊరులో ఉంది. దీనినే సాక్షిగోపాల్ ఆలయమని, దీనిని సత్యబా(వా)ది గోపినాథ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది మధ్యయుగంనాటి గోపీనాథుడి ఆలయం. దీనిని కళింగ నిర్మాణ శైలిలో నిర్మించారు.
సాక్షిగోపాలుడు
[మార్చు]ఆ గ్రామానికి చెందిన ఒక పేద యువకుని వలన ఈ ఆలయానికి సాక్షిగోపాల అనే పేరు వచ్చింది. అతను గ్రామ పెద్ద కుమార్తెతో ప్రేమలో పడ్డాడని చెబుతారు. అయితే, ఆర్థికంగా ఉన్నత హోదా అయినందున, ఈ వివాహాన్ని గ్రామపెద్ద వ్యతిరేకించాడు. తరువాత ఆ గ్రామపెద్ద, ఆ యువకుడు, గ్రామస్తులు బృందావనం తీర్థయాత్రకు వెళ్లారు. గ్రామ పెద్ద అనారోగ్యానికి గురైనప్పుడు ఆ గ్రామస్తులు అతనిని విడిచిపెట్టారు. అయితే ఆ యువకుడు అతనికి బాగా సేవ చేయడంతో గ్రామ పెద్ద త్వరగా కోలుకుని, తన కుమార్తెకు ఆ యువకుడితో వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. అయితే వారు గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత, ఆ గ్రామ పెద్ద తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు, ఇంకా ఆ యువకుడిని ఒక సాక్షిని చూపించమని చెప్పాడు.
ఆ యువకుడి భక్తికి సంతోషించిన గోపాలుడు, ఒక షరతు మీద సాక్ష్యమివ్వడానికి అంగీకరించాడు. అది ఏమంటే గోపాలుడు ఆ యువకుడుని దారిలో అనుసరిస్తాడు, కానీ ఆ యువకుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు. ఒక ఇసుక దిబ్బను దాటి గ్రామానికి వెళ్ళే మార్గంలో ఆ యువకుడు గోపాలుని అడుగుజాడలను వినపడక వెనక్కి తిరిగాడు. వెంటనే భగవంతుడు ఆ ప్రదేశంలో పాతుకుపోయి, రాతి విగ్రహంగా మారాడు. గ్రామస్తులు ఆ యువకులకు వివాహం జరిగిందని ఆ దేవుడు స్వయంగా మద్దతు ఇచ్చాడు అని భావించారు. తరువాత సాక్ష్యమివ్వడానికి (సంస్కృతం లో సాక్షి అని పిలుస్తారు) వచ్చిన గోపాలుని గౌరవార్థం, వారు నిర్మించిన ఆలయానికి ఆ యువకుని మొదటి పూజారిగా నియమించారు.
వజ్రనాభుని వృత్తాంతం
[మార్చు]వజ్రనాభుడు అనే రాజు (శ్రీకృష్ణుడి మునిమనవడు) కృష్ణుని ఇంకా ఇతర 16 దేవుళ్ళను బ్రజా అనే అరుదైన, నాశనము లేని రాతితో చెక్కించాడు శ్రీకృష్ణుని ఉనికిని ఆస్వాదించడానికి మథుర చుట్టుపక్కల ఈ దేవతల కోసం దేవాలయాలను నిర్మించారు. ఈ నలుగురు ప్రధాన దేవతలు - గోవర్ధన్ లోని శ్రీ హరిదేవ, మధురలోని శ్రీ కేశవదేవ, బాలదేవ్ లోని శ్రీ బాలదేవ, బృందావనం లోని శ్రీ గోవిందజీ. ఇంకా - మొదట గోవర్ధన్లో ఉండి ఇప్పుడు రాజస్థాన్ నాథద్వారాలో ఉన్న శ్రీ నాథ్ జీ, జైపూర్ ఉన్న శ్రీ గోపీనాథ్. ఇంకో ఇద్దరు గోపాలురలో రాజస్థాన్లోని కరోలిలో ఉన్న శ్రీమదన మోహన ఒకడు అయితే ఒడిశాలో పూరీ సమీపంలోని సఖి గోపాల్ పట్టణానికి తరలించబడిన సాక్షి గోపాలుడు.
అమ్లా నవమి
[మార్చు]ఈ ఆలయం ప్రతి సంవత్సరం అమ్లా నవమి పండుగ (అమ్లా = ఉసిరి; నవమి = చంద్రమానం ప్రకారం తొమ్మిదవ రోజు) జరుపుతుంది. ఈ పండుగ ఆచారంలో ముఖ్య భాగంగా రాధ పాదాలను తాకడం అనే అంశం ఉంటుంది (రాధ శ్రీ కృష్ణుడి ప్రేమికురాలు ). ఈ ఆలయాన్ని మొదట రాధ విగ్రహం లేకుండా నిర్మించినట్లు చెబుతారు. కానీ లఖ్మీ అనే అమ్మాయి రాధ అవతారమని చెప్పిన్నప్పుడు, కృష్ణుడు (గోపాల) వంటివాడు రాధ లేకుండా ఉండకూడదని భావించి, ఉత్తర భారతదేశం నుంచి ఒక విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మొదట ఘాగ్రా, చోళితో అలంకరించారు. కానీ ఒడిశా సంప్రదాయ చీర ధరించినప్పుడు, విగ్రహం పాదాలు కనిపించాయి, పూజారులు దీనిని పవిత్ర చిహ్నంగా పరిగణించారు. ఆ రోజు నుండి అమ్ల నవమిని జరుపుకుంటారు. ఆలయం లోపల దేవత పాదాలను తాకడానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు [1][2]
ప్రసాదం
[మార్చు]సాక్షిగోపాల ఆలయంలో ప్రసాదం బియ్యానికి బదులుగా గోధుమలతో తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాలలో ఆరాధన ప్రక్రియలలో ఈ ప్రసాదం ఒక ముఖ్యమైన సమర్పణ.
మూలాలు
[మార్చు]- ↑ "Lakhs witness 'Radha pada' at Sakhigopal". The New Indian Express. 18 November 2010. Retrieved 13 November 2016.
- ↑ Famous for Radha Pad Darshan festival: https://www.bhaktibharat.com/en/mandir/sakhi-gopal-mandir