సజ్జావారిపాలెం
Appearance
సజ్జావారిపాలెం | |
— రెలెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′25″N 80°47′48″E / 16.00683°N 80.79674°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ దండముడి సాంబశివరావు, |
పిన్ కోడ్ | 522265 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
సజ్జావారిపాలెం, బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దండముడి సాంబశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు.
ప్రధాన పంటలు
[మార్చు]ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ప్రముఖులు (నాడు/నేడు)
[మార్చు]శ్రీ వల్లభనేని సత్యసాయిబాబా
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన శ్రీ వల్లభనేని సత్యసాయిబాబా, సూక్ష్మకళాకారుడు. వ్యర్ధాలతో కళాఖండాలు రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ఈయన స్థానం దక్కించుకున్నారు. వీరు కొబ్బరి చిప్పలతో కళాఖండాలు రూపొందించి, మరో రికార్డు స్వంతం చేకుకున్నారు. వీరికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. వీరు 2014, నవంబరు-24న తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి పురస్కారం అందుకున్నారు.
- చెన్నైలోని తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నిర్వహించే, "ఇంటర్నేషనల్ రికార్డ్ బ్రేకర్స్ ఫెస్టివల్-2015"కు వీరికి ఆహ్వానం అందినది. 2015, జనవరి-2 నుండి 18 వరక్, చెన్నైలో అంతర్జాతీయస్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వీరికి రికార్డు ఇవ్వనున్నట్లు, "మల్టిపుల్ వర్ల్డ్ రికార్డ్ అఛీవర్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు" డాక్టర్ బాబు బాలకృష్ణన్, తన ఆహ్వాన పత్రికలో వివరించారు.
- వీరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. ఈ మేరకు వారు పంపిన ధ్రువపత్రం, ఙాపిక వారికి అందినవి.
- వీరి పేరు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినది. ఈ మేరకు వారు పంపిన ఒక ధ్రువపత్రాన్ని, 2015, నవంబరు-1వ తేదీనాడు, రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాదు చేతులమీదుగ అందుకున్నారు.
- వీరి పేరు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినది. కొబ్బరి చిప్పలు, వ్యర్ధాలతో సుమారు 300 పైగా కళాఖండాలు రూపొందించి, ఆరు ప్రపంచ రికార్డులు, ఐదు జాతీయ రికార్దులు, నాలుగు పురస్కారాలు స్వంతం చేసుకున్న నేపథ్యంలో వీరికి ఈ ఘనత దక్కినది.
- వీరిని ఫ్రైడ్ ఇండియా అను సంస్థ వారు కళా శిరోమణి పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ మేరకు అ సంస్థ అధ్యక్షులు శ్రీ బి.వి.పట్టాభిరాం, 2016, జనవరి-23వ తేదీనాడు, విజయవాడలోని ఐ.ఎం.యే.ఫంక్షన్ హాలులో వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. కొబ్బరి చిప్పలతో వివిధ కళాఖండాలు తయరు చేసినందుకు వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసారు.
- కొబ్బరిచిప్పలపై కళాఖండాలు రూపొందించినందుకు, వీరు తాజాగా అసిస్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ఆర్. రాజేంద్రన్ పంపిన రికార్డును, ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ, వీరికి, 2016, మార్చి-29న తెనాలిలో అందజేసినారు.
- కొబ్బరిచిప్పలపై కళాఖండాలు రూపొందించినందుకు, వీరు యు ఆర్ ఎఫ్ వరల్డ్ ఐకాన్ రికార్డ్స్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్ష్లులు శ్రీ సిద్ధార్ధ ఘోష్ పంపించిన ధ్రువపత్రాన్ని, వీరు 2016, నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ చినరాజప్ప చేతులమీదుగా అందుకున్నారు.
- వీరిని 2017, వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ ఎన్‌సైక్లోపీడియా (WRH) సభ్యత్వానికి ఎంపిక చేసారు. కొబ్బరిచిప్పలతో కాళాకృతులు రూపొందించినందుకు, వీరికి ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ మేరకు వీరికి ఎన్‌సైక్లోపీడియా డైరెక్టర్, ధ్రువపత్రం, సెలెబ్రిటీ గుర్తింపు కార్డు అందజేసినారు.