సత్యవోలు గున్నేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యవోలు గున్నేశ్వరరావు
Sathyavolu Gunneshwararao.jpg
జననం1879
రాజమండ్రి
మరణంఫిబ్రవరి 2, 1925
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తిkaranam, నాటకరంగ పోషకుడు, సమాజ నిర్వాహకుడు
తల్లిదండ్రులుSatyavolu Parvsthesam,Ramanamma

సత్యవోలు గున్నేశ్వరరావు రంగస్థల నటుడు, నాటకరంగ పోషకుడు, సమాజ నిర్వాహకుడు.[1]

జననం - కుటుంబ నేపథ్యం[మార్చు]

గున్నేశ్వరరావు 1860 లో రాజమండ్రి లో జన్మించాడు. ఈయనది సంపన్న కుటుంబం. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న గున్నేశ్వరరావు రాజమండ్రికి కరణం గా పనిచేశాడు.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

స్వయంగా నటుడు కాకపోయినా, నాటకకళమీద అమితమైన అభిమానం కలవాడు. 1908లో కృత్తివెంటి నాగేశ్వరరావు తో కలిసి రాజమహేంద్రవరపు హిందూ నాటక సమాజ బాధ్యతను స్వీకరించి, ఆ సమాజం స్వయం సమగ్రమైన ఉత్తమ సమాజంగా రూపొందడానికి కృషి చేశాడు. 1912లో కృత్తివెంటి నాగేశ్వరరావుతో విడిపోయి, 1914లో గున్నేశ్వరరావు సొంతంగా నాటకసమాజాన్ని ప్రారంభించాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆ సమాజానికి చింతామణి థియేటర్ అని పేరు పెట్టాడు, కానీ అందరూ 'గున్నేశ్వరరావు కంపెనీ' అనే పేరుతోనే పిలిచేవారు. 1923 వరకు చాలా కట్టుదిట్టంగా సాగిన చింతామణి థియేటర్ గున్నేశ్వరరావు మరణాంతరం జయా టాకీసు గా మారింది. దుర్గి గోపాలకృష్ణారావు, అయినవోలు తాతయ్య నాయుడు, నేతి సుబ్బయ్య, సరిపల్లె కామేశ్వరరావు, ధరణిప్రగడ వెంకటశివరావు, ఇమ్మానేని హనుమంతరావు నాయుడు, బంగారురాజు మొదలైనవారు గున్నేశ్వరరావు సహనటులుగా ఉండేవారు.

మరణం[మార్చు]

గున్నేశ్వరరావు 1925, ఫిబ్రవరి 2న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.285.