సత్య (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్య (సినిమా)

సత్య రాంగోపాల్ వర్మ రచన, దర్శకత్వం వహించిన 1998 నాటి తెలుగు అనువాద చలనచిత్రం. వర్మతో పాటుగా స్క్రీన్ ప్లే-డైలాగులు సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ రచించారు.

సినిమాలో జె. డి. చక్రవర్తి, మనోజ్ బాజ్ పేయి, ఊర్మిళ మండోద్కర్, షెఫాలీ షా, అరుణ్ బాలి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన భారతీయ గ్యాంగ్ స్టర్ ట్రయాలజీలో మొదటి సినిమా. దీనిలో ముంబైకి వలసవచ్చిన సత్య అనే యువకుడు ముంబై అండర్ వరల్డ్ లో ఇరుక్కోవడాన్ని కథగా చూపారు. 1998 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా,[1] స్విట్జర్లాండ్ లోని ఫ్రీబర్గ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటివాటిలో ఈ సినిమాను ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించారు.[2][3] సిఎన్ఎన్-ఐబియన్ 100 సార్వకాలిక అత్యుత్తమ భారతీయ చలన చిత్రాల జాబితాలో చేరింది.[4] 2005లో ఇండియన్ టైంస్ మూవీస్ సత్యను  తప్పకుండా చూడాల్సిన 25 బాలీవుడ్ సినిమాల జాబితాలో చేర్చింది.[5]

2 కోట్ల రూపాయలతో ఇబ్బందికరమైన తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను పూర్తిచేశారు[6] 1998లో సత్య బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన హిట్ గా నిలిచింది.[7][8] ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ మూవీతో సహా 6 పురస్కారాలు సాధించింది. 4 స్టార్ స్క్రీన్ అవార్డులు, బాలీవుడ్ మూవీ అవార్డు నుంచి ఉత్తమ దర్శకుడు పురస్కారం పొందింది. సత్య 1990ల నాటి సినిమాల్లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగానూ, మాడర్న్ మాస్టర్ పీస్ గానూ పరిగణిస్తారు. అలానే గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో అత్యుత్తమమైన సినిమాల్లో ఒకటిగా భావిస్తారు.[9] సినీ విమర్శకుడు రాజీవ్ మసాంద్ సత్యని (దాని సీక్వెల్ కంపెనీతో కలిపి) గత పది సంవత్సరాల్లో అత్యంత ప్రభావశీలమైన సినిమాల్లో ఒకటిగా అభివర్ణించారు.[10] ఈ సినిమా కొత్త జానర్ కు నాంది పలికింది, ఫిల్మ్ నాయిర్ యొక్క ఒకానొక కొత్త పంథాగా భావించే[9] ముంబై నాయిర్ ను ప్రారంభించింది, దీనిలో వర్మ మాస్టర్ గా పేరొందారు.[11]

ఇతివృత్తం

[మార్చు]

ముంబై అండర్ వరల్డ్ అన్న పేరుతో రెండు గ్యాంగుల మధ్య జరుగుతున్న గ్యాంగ్ వార్ ముంబైలో జరుగుతున్న సమయం. ఏదోక పని చేసుకునేందుకు గతమే లేని ఓ అనాథ - సత్య (జె.డి. చక్రవర్తి) ముంబాయికి వలస రావడంతో సినిమా ప్రారంభం అవుతుంది. స్థానిక డాన్స్ బార్లో వెయిటర్ గా పనిచేస్తున్నపుడు అత్యంత ప్రమాదకరమైన డాన్ గురు నారాయణ్ (రాజు మవానీ) కింద వసూళ్ళు చేసుకునే రౌడీ జగ్గా (జీవా)తో గొడవ అవుతుంది. సత్యని తార్పుడు పని చేశాడన్న తప్పుడు ఆరోపణలపై అరెస్టు చేయించి, శిక్ష వేయించి జగ్గా తన కక్ష తీర్చుకుంటాడు. సత్య జైలులో మాఫియాలో మరో సభ్యుడు, అండర్ వరల్డ్ డాన్ భీకూ మాత్రే (మనోజ్ బాజ్ పేయ్)తో గొడవ పడతాడు, భీకూ ఓ సినిమా నిర్మాత హత్యలో నిందితునిగా జైలులో ఉంటాడు. సత్య ధైర్యానికి మాత్రే చాలా ఆనందించి, స్నేహ హస్తాన్ని చాస్తాడు. సత్య విడుదల కావడానికి, అతను నివసించడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఏ బార్ లో తనతో మొదట వివాద పడ్డాడో అదే బార్ లో మాత్రే సహాయంతో జగ్గాను కాల్చి చంపి కక్ష తీర్చుకుంటాడు సత్య. అంతటితో అతను భీకూ మాత్రే గ్యాంగులో చేరతాడు.

స్వంత గ్యాంగును నడపడం ఆరంభించే ముందు మాత్రే పనిచేసిన గ్యాంగులో గురు నారాయణ్, కల్లు మామ (సౌరభ్ శుక్లా), వకీలు చంద్రకాంత్ మూలే (మక్రంద్ దేశ్ పాండే). ప్రస్తుత ముంబై మహానగర పాలకసంఘ కార్పొరేటర్ భావ్ ఠాకూర్ దాస్ జ్వాలే (గోవింద్ నమాడే)  ఆ గ్యాంగ్ నాయకునిగా ఉండేవారు. భావ్ రాజకీయాల్లో చేరాకా, గ్యాంగు రెండుగా చీలిపోయి కల్లు, మూలే మాత్రే గ్యాంగులో చేరగా, నారాయణ్ వేరే గ్యాంగ్ ఏర్పరుచుకుంటారు. గ్యాంగులు తమ తమ ప్రాంతాలు, కార్యకలాపాలు విభజించుకుని ఒకరి ప్రాంతంలోకి మరొకరు రాకుండా  కట్టుబాటు చేసుకున్నాకా రెండు గ్యాంగులు భావ్ తో సంబంధాలు కొనసాగించాయి. జగ్గా మరణంతో ఆ సంధి దెబ్బతిని, మాత్రే గ్యాంగ్ తమ వ్యాపారాని(వసూళ్ళు)కి బయటకు వెళ్ళినప్పుడు వారిపై దాడి చేస్తాడు. ఈ పని గురు నారాయణే చేశాడని సత్య కనిపెట్టడంతో, మాత్రే  గురు నారాయణ్ ని చంపేందుకు ప్రయత్నిస్తూ ఆఖరి నిమిషంలో భావ్ నుంచి వద్దని వచ్చిన ఆదేశాలతో ఆపేస్తాడు; పురపాలక ఎన్నికలకు సరిగ్గా ముందు ఆ హత్య జరిగితే గ్యాంగ్ వార్ ప్రారంభమై భావ్ రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయని ఆపిస్తారు.  ఈలోగా గ్యాంగులో కీలకమైన నిర్ణయాత్మక శక్తిగా సత్య ఎదుగుతాడు. అతను ఎదురింట్లోని, వర్ధమాన గాయని విద్య (ఊర్మిళ మండోత్కర్) తో ప్రేమలో పడతాడు. ఆమెకు మాత్రం సత్య మాఫియాలో సభ్యుడన్న విషయం తెలియనివ్వరు. ఒకానొక సమయంలో సంగీత దర్శకుణ్ణి చంపుతామని బెదిరించి విద్యకు పాటపాడే ఛాన్స్ ఇప్పిస్తాడు, ఇదంతా విద్యకు తెలియకుండానే జరుగుతుంది.

భావ్ ఆదేశాలపై అసహనంగా ఉన్న మాత్రేతో అతన్ని పట్టించుకోవద్దని సత్య సలహా ఇస్తారు. దాంతో వారిద్దరూ కలిసి గురు నారాయణ్ ను చంపేస్తారు. దాంతో మాత్రే అండర్ వరల్డ్ కు ఎదురులేని పాలకుడిగా నిలుస్తారు, భావ్ ఠాకూర్ దాస్ జ్వాలేకు అతని సహకారం లేకుంటే ఎన్నికల్లో గెలవడం కష్టమని అతనితో కలిసిపోతారు. ఈ సమయంలో నగరంలో కొత్త పోలీస్ కమిషనర్ అమోద్ శుక్లా (పరేష్ రావెల్) ఛార్జి తీసుకుంటారు. శుక్లా, అతని సహచరులు మాత్రే గ్యాంగ్ ను ఎన్ కౌంటర్ల ద్వారా చంపుతూ పోతారు. పరిస్థితి చేయిదాటిపోవడం సత్య గమనించి కమిషనర్ ను అడ్డుతొలగించాలని చెప్పి ఒప్పించి, అతన్ని చంపేస్తారు. పోలీసులు ప్రతీకారంతో రగిలిపోయి మరింతగా గ్యాంగ్ స్టర్లను చంపడం కొనసాగిస్తారు. ఈ క్రమంలో కొందరు సామాన్య ప్రజలు కూడా మరణిస్తారు. ఈ పోలీసు రాజ్యం పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రజలు, భీకూ మాత్రే బలం కలిపి భావు ఎన్నికల్లో గెలుపొందుతారు. ఈ లోగా సత్య, విద్య ఓ సినిమాకి వెళ్తారు. సత్య సినిమా హల్లో ఉన్నాడన్న విషయం తెలుసుకుని ఇన్స్పెక్టర్ ఖండిల్కర్ (ఆదిత్య శ్రీవాస్తవ), తన పోలీసు బలగంతో సహా చుట్టుముట్టి, తలుపులు వేసేస్తాడు. సినిమా పూర్తయ్యాకా ఒక్కొక్కరిని చెక్ చేస్తూ తలుపు గుండా పంపిస్తాడు. సత్య తుపాకీ కాలుస్తాడు, తత్ఫలితంగా చెలరేగిన తొక్కిసలాటలో పలువురు మరణిస్తారు, సత్య, విద్యతో కలసి తప్పించుకుంటారు. ఐతే చావుకు భయపడని సత్య ఇప్పుడు విద్య ప్రాణం గురించి భయపడుతుంటారు, అండర్ వరల్డ్ ను వదిలేద్దామని నిర్ణయించుకుని, తన నిర్ణయాన్ని  మాత్రేతో చెప్తారు. మాత్రే వాళ్ళిద్దరినీ సురక్షితంగా ఉండేందుకు వీలుగా దుబాయ్ పంపించేద్దామని నిర్ణయించుకుంటారు.

జ్వాలే తన విజయోత్సవాలు జరుపుకునేందుకు అంటూ ఓ పార్టీ ఏర్పాటుచేస్తాడు, దానికి మాత్రే, మూలే, కల్లు హాజరవుతారు. పార్టీలో అంతకుముందు స్వతంత్రంగా నడుచుకుని, తన మాటలు ఖాతరుచేయనందుకు హఠాత్తుగా మాత్రేని జ్వాలే చంపేస్తాడు.ఈ లోగ విద్య కు మనం దుబాయ్ వెల్లిపోదాం చెప్పే టైం కు పోలీస్ బలగాలు రావడం అక్కడి నుండి సత్య తప్పించుకొని కళ్ళు మామ ను కలవడం మాత్రే మరణ వార్తా విని , వినాయక నిమజ్జనం లో ఉన్న జ్వాలె ను చంపి , చివరకు పోలీస్ బలగాల చేతిలో సత్య అంతం అవుతాడు.

నిర్మాణం

[మార్చు]
  1. "iffi.nic.in/Dff2011/FrmIP1998Award.aspx?" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-04-02.
  2. "Edouard Waintrop on the New Indian Cinema : UP Front – India Today". India Today. 18 May 2012. Retrieved 27 September 2012.
  3. David (16 June 2006). "The Films of Ram Gopal Varma – An Overview". Cinema Strikes Back. Retrieved 22 February 2009.
  4. "100 Years of Indian Cinema: The 100 greatest Indian films of all time|Movies News Photos-IBNLive". Archived from the original on 2013-04-24. Retrieved 2016-04-02.
  5. Rachna Kanwar (3 October 2005). "25 Must See Bollywood Movies". Indiatimes Movies. Archived from the original on 10 జూన్ 2008. Retrieved 17 June 2008.
  6. Sandeep Unnithan (10 February 2003). "One - Man Company". India Today. Retrieved 17 June 2008.
  7. Deepa Deosthalee (22 October 1998). "Satya cast in heroes' mold, mobbed by crowd". Indian Express. Retrieved 17 June 2008.
  8. "Box Office 1998". BoxOfficeIndia.com. Archived from the original on 22 జనవరి 2008. Retrieved 17 June 2008.
  9. 9.0 9.1 Rachel Dwyer (30 May 2005). "Behind The Scenes". Outlook Magazine. Retrieved 18 August 2010.
  10. Rajeev Masand (18 July 2008). "Masand's Verdict: Contract, mangled mess of Satya, Company". CNN-IBN. Retrieved 18 August 2010.
  11. Aruti Nayar (16 December 2007). "Bollywood on the table". The Tribune. Retrieved 19 June 2008.