Jump to content

సత్రసాల

అక్షాంశ రేఖాంశాలు: 16°35′31″N 79°29′07″E / 16.591929°N 79.485175°E / 16.591929; 79.485175
వికీపీడియా నుండి
సత్రసాల
—  రెవెన్యూయేతర గ్రామం  —
సత్రసాల is located in Andhra Pradesh
సత్రసాల
సత్రసాల
అక్షాంశరేఖాంశాలు: 16°35′31″N 79°29′07″E / 16.591929°N 79.485175°E / 16.591929; 79.485175
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం రెంటచింతల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 421
ఎస్.టి.డి కోడ్

సత్ర సాల, పల్నాడు జిల్లా, రెంటచింతల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. సత్రసాల కృష్ణానది దక్షిణపు ఒడ్డున ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామంలో అనేక ప్రాచీన శివాలయాలున్నాయి.[1] సత్రసాల వద్ద కృష్ణానది దాటడానికి తెప్ప సౌకర్యం ఉంది.

శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం

[మార్చు]
  1. 1244లో కాకతీయ సామంతుడు మహామండలేశ్వర కాయస్థ అంబయ్య దేవుడు[2] సత్రసాలలోని స్వయంభూ శ్రీమహాదేవుని ఆలయానికి మార్గళి ఉత్సవం జరపడానికి ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రాంతంలో వసూలైన సుంకాలను ఆ నిమిత్తం నియమించాడు.[3] ఇక్కడ పూర్వం విశ్వామిత్రాశ్రమం ఉండేదని ప్రతీతి.
  2. ఈ ఆలయం పల్నాటి పురాతన పుణ్యక్షేత్రం.
  3. కార్తీకమాసంలో ఈ ఆలయం, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, అయ్యప్ప భక్తుల భజనలు, భక్తుల ప్రత్యేకపూజలతో కళకళలాడుతుంది. భక్తులు నిత్యం, వేకువఝామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి పల్నాడు జిల్లా నుండియేగాక, నల్లగొండ జిల్లా గ్రామాలయిన అడవిదేవులపల్లి తదితర గ్రామాలనుండి గూడా భక్తులు విచ్చేస్తారు. వీరి సౌకర్యార్ధం, కృష్ణానదిలో లాంచీలు ఏర్పాటు చేసెదరు.
  4. ఈ ఆలయంలో, ప్రతి సోమవారం స్వామివారి దర్శనానికి వచ్చు భక్తులకు, ప్రత్యేకపూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.

శ్రీ నాంచారమ్మ, పోతురాజు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారల ఆలయం

[మార్చు]

నూతనంగా ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో, 2017, మార్చి-8వతేదీ బుధవారంనాడు, నాంచారమ్మ, పోతురాజు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్ర విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సత్రసాల&oldid=4130417" నుండి వెలికితీశారు