Jump to content

సనా జావెద్

వికీపీడియా నుండి
సనా జావేద్
జననం (1993-03-25) 1993 మార్చి 25 (వయసు 31)[1]
జాతీయతపాకిస్తానీ
విద్యాసంస్థకరాచీ విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
[ఉమైర్ జస్వాల్
(m. 2020; div. 2023)

సనా జావేద్ (జననం 1993 జూన్ 6) ఉర్దూ టెలివిజన్‌రంగానికి చెందిన పాకిస్తానీ నటి. ఆమె 2012లో షెహర్-ఎ-జాత్‌తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అనేక సీరియల్స్‌లో కనిపించింది. రొమాంటిక్ డ్రామా ఖానీలో టైటిల్ రోల్ పోషించిన ఆమె మంచి గుర్తింపు పొందింది. దీనిలో ఆమె నటనకు లక్స్ స్టైల్ అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది. ఆమె రుస్వాయి, డంక్ ధారావాహికలతోనూ ప్రశంసలు పొందింది. అంతేకాకుండా, ఇది ఆమెకు ఉత్తమ నటిగా ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (పిఐఎస్ఎ) అవార్డును సంపాదించిపెట్టింది.

ఆమె మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు చేసింది. ఆమె 2012 సిరీస్ మేరా పెహ్లా ప్యార్‌లో సహాయక పాత్ర పోషించింది. అదే సంవత్సరంలో షెహర్-ఎ-జాత్‌లో చిన్న పాత్రలో నటించింది.[2][3][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సనా జావేద్ 1993 మార్చి 25న సౌదీ అరేబియాలోని జెద్దాలో పాకిస్తానీ తల్లిదండ్రులకు జన్మించింది.[5][6][7] ఆమె పూర్వీకులు హైదరాబాద్ దక్కన్‌కు చెందినవారు.[8]

జెద్దాలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత, ఆమె తన కుటుంబంతో కలిసి లాహోర్‌కు వెళ్లి కరాచీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది.

అక్టోబరు 2020లో, ఆమె గాయకుడు ఉమైర్ జస్వాల్‌ని కరాచీలోని తన ఇంటిలో ఒక ప్రైవేట్ నికాహ్ వేడుకలో వివాహం చేసుకుంది. ఉమైర్ జస్వాల్ 2023 నవంబరు 28న సనా జావేద్‌కి విడాకులు ఇచ్చాడు.

2024 జనవరి 19న, కరాచీలోని తన ఇంట్లో జరిగిన వేడుకలో మాజీ పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని ఆమె రెండవ సారి వివాహం చేసుకుంది.[9][10][11]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం పురస్కారం విభాగం సినిమా ఫలితం
2019 లక్స్ స్టైల్ అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్-పాపులర్ ఖానీ నామినేటెడ్
బెస్ట్ యాక్ట్రెస్-క్రిటిక్స్ నామినేటెడ్
2020 పిఐఎస్ఎ అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్-క్రిటిక్స్ రుస్వై విజేత
2021 పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్-In A Nand Role విజేత

మూలాలు

[మార్చు]
  1. Mirza Iftikhar Baig (8 March 2020). "میرا مقابلہ خود مجھ سے ہے" [My Only Competition Is Myself]. Dunya. Retrieved 3 May 2020.
  2. "Sana Javed for the 8th episode of Iftar Mulaqaat Archives – Entertainment, Fashion & Technology Updates". www.trendinginsocial.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 31 March 2018.
  3. Talk Shows Central (28 June 2017), Mazaaq Raat 28 June 2017 | Mehrunisa V Lub U Movie Cast – tera baap aaya, retrieved 31 March 2018
  4. "Sana Javed and Danish Taimoor in Jago Pakistan". www.stylechunk.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 1 ఏప్రిల్ 2018. Retrieved 31 March 2018.
  5. "Sana Javed - Biography, Age, Husband, Career, and Much More!". Dispatch News Desk (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-24. Retrieved 2021-05-07.
  6. "Sana Javed's strong character in 'Khaani' will surely inspire every woman". Daily Times. Retrieved 25 March 2018.
  7. "Sana Javed set to star alongside Danish Taimoor in debut film – The Express Tribune". The Express Tribune. 27 September 2016. Retrieved 31 March 2018.
  8. "Sana Javed Husband, Age, Marriage, Shoaib Malik, Wedding, Sister, Father, Height, Family & Biography". Hamariweb.com Profiles (in ఇంగ్లీష్). Retrieved 2024-01-20.
  9. "Umair Jaswal, Sana Javed tie the knot | SAMAA". Geo TV (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-01-20.
  10. Eenadu (20 January 2024). "మరో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  11. Namaste Telangana (20 January 2024). "షోయబ్-సనాల వివాహం‌.. ఆ ఇద్దరి మధ్య వయసు తేడా ఎన్నేళ్లో తెలుసా..?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.