సనా సయీద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సనా సయీద్
గ్లోబల్ పీస్ ఫ్యాషన్ షో, 2013లో సనా సయీద్
జననం (1988-09-22) 1988 సెప్టెంబరు 22 (వయసు 35)[1]
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1998–2019, 2022

సనా సయీద్ (జననం 1988 సెప్టెంబరు 22) భారతీయ నటి, మోడల్. ఆమె బాలీవుడ్ చలనచిత్రాలు, టెలివిజన్‌ షోలలో నటిస్తుంది.[2] ఆమె మొట్టమొదటిసారిగా కుచ్ కుచ్ హోతా హై (1998)లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.[1] ఆ తరువాత హర్ దిల్ జో ప్యార్ కరేగా (2000), బాదల్ (2000) వంటి చిత్రాలతో నటించడం కొనసాగించింది. ఆమె బాబుల్ కా ఆంగన్ చూటే నా (2008), లొ హో గయీ పూజా ఇస్స్ ఘర్ కి (2008) వంటి టెలివిజన్ షోలలో కూడా నటించింది.

2012లో, ఆమె కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో సహాయక పాత్రతో పెద్ద తెరపై అడుగుపెట్టింది, ఇది బాక్సాఫీసు వద్ద వాణిజ్యపరంగా పెద్ద విజయం సాధించింది.[3] ఆమె రియాల్టీ షోలు ఝలక్ దిఖ్లా జా 6 (2013), నాచ్ బలియే 7 (2015), ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 (2016)లలో పాల్గొన్నది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "12 child artistes who turned into beautiful divas". Mid-Day. 22 September 2015. Retrieved 15 July 2018.
  2. "Sana Saeed home". Mumbai Mirror. The Times of India. 28 August 2013. Retrieved 15 July 2018.
  3. Joginder Tuteja (22 October 2012). "Karan scores hat trick with SOTY scoring very well at the Box Office". Koimoi.com. Retrieved 15 July 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=సనా_సయీద్&oldid=4000992" నుండి వెలికితీశారు