సనే లూస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సనే లేస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సనే ఎల్బే లేస్
పుట్టిన తేదీ (1996-01-05) 1996 జనవరి 5 (వయసు 28)
ప్రిటోరియా, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేయి లెగ్ స్పిన్|లెగ్ బ్రేక్
పాత్రబౌలింగ్ (క్రికెట్), బౌలింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 62)2022 27 జూన్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 63)2012 6 సెప్టెంబర్ - బాంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2023 8 సెప్టెంబర్ - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.96
తొలి T20I (క్యాప్ 30)2012 11 సెప్టెంబర్ - బాంగ్లాదేశ్ తో
చివరి T20I2023 1 సెప్టెంబర్ - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–ప్రస్తుతం ఉత్తర మహిళా క్రికెట్ జట్టు|నార్తర్న్స్
2017యార్క్‌షైర్ డైమండ్స్
2018/19బ్రిస్బేన్ హీట్ (WBBL)
2019లాంక్షైర్ థండర్
2020IPL వెలాసిటీ
2022IPL సూపర్నోవాస్
2022ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (WCPL)
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I
మ్యాచ్‌లు 1 106 91
చేసిన పరుగులు 37 1,799 931
బ్యాటింగు సగటు 18.50 24.31 20.68
100s/50s 0/0 0/13 0/4
అత్యధిక స్కోరు 27 93 71
వేసిన బంతులు 60 3,297 954
వికెట్లు 0 115 48
బౌలింగు సగటు 21.36 21.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 5 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/36 5/8
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 45/– 33/–
మూలం: Cricinfo, 21 ఫిబ్రవరి 2023

సనే లూస్ (soo-NAY-_-LOOS) 5 జనవరి, 1996 న జన్మించింది. ఆమె దక్షిణాఫ్రికా కు ప్రాతినిధ్యం వహించిన ప్రొఫెషనల్ క్రికెటర్, ఆల్ రౌండర్. జాతీయ క్రికెట్ జట్టు కోసం లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంది.[1][2]

విద్య, క్రికెట్ ప్రారంభం

[మార్చు]

లూస్ ప్రిటోరియా లో పుట్టి పెరిగింది.[2][3] ఆమె చిన్నతనం నుంచి ఆమె తండ్రి ఆమెను క్రికెట్ ఆడమని ప్రోత్సహించాడు.[4] ఆతను మినీ క్రికెట్ కోచ్. నేను ఇప్పటికీ తండ్రి కూతురునే అని లూస్ చెపుతుంది. నాలుగేళ్ల వయసులో ఆమె తన తండ్రి , అన్నతో కలిసి మినీ క్రికెట్ ఆడటం ప్రారంభించింది.[3][5][5]

ఏడు సంవత్సరాల వయస్సులో లూస్ తన ప్రాథమిక పాఠశాల లార్స్కూల్ వూర్పోస్ అండర్ - 10 బాలుర జట్టులో చేరింది.[3] ప్రారంభంలో ఒక వికెట్ కీపర్ / ఆల్ రౌండర్ / ఓపెనింగ్ పేస్ బౌలర్ గా ఆమె , అబ్బాయిలతో అమ్మాయిలు క్రికెట్ ఆడగలరని నిరూపించగలిగింది.[5] అదే సంవత్సరం ఆమె మహిళా క్లబ్ తరపున క్రికెట్ ఆడటం ప్రారంభించింది. నార్తర్న్ అండర్ - 13 ప్రాంతీయ జట్టుకు ఎంపికైంది.[3] 12 సంవత్సరాల వయస్సులో ఆమె అండర్ - 19 ప్రావిన్షియల్ జట్టులో చేరింది. మరుసటి సంవత్సరం నాటికి ఆమె సీనియర్ ప్రావిన్షియల్ జట్టు తరపున ఆడింది.[3] 2009లో 13 సంవత్సరాల వయస్సులో లూస్ అండర్ - 19 జాతీయ జట్టుకు ఎంపికయ్యింది. 2010, 2011 రెండింటిలోనూ ఆమె జాతీయ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న ఈ జట్టుకు నాయకత్వం వహించింది. ఆమె హోర్స్కూల్ మెన్లోపార్క్లో మాధ్యమిక పాఠశాలను కూడా ప్రారంభించింది, పాఠశాల అండర్ - 14A బాలుర జట్టులో ప్రారంభ బ్యాటర్ అయింది. తరువాత ఆమె అండర్ - 15ఎ జట్టు తరపున ఆడింది, ఇందులో ఆమె ఇప్పటికే అండర్ - 14 స్థాయిలో ప్రాంతీయ క్రికెట్ ఆడిన బాలురతో పోటీ పడింది.[3]

లూస్ టెన్నిస్ కూడా ఆడుతూ ఉండేది. చివరికి ఆమె విదేశీ పర్యటనల సౌకర్యం గురించి ఆమె క్రికెట్ ఎంచుకుంది. ఆమె తల్లి టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆమె నిర్ణయానికి మద్దతు ఇచ్చారు, ఆమె ఆడిన అన్ని క్రికెట్ మ్యాచ్ లను చూశారు.[6]

సెప్టెంబర్ 2012 లో 16 సంవత్సరాల వయస్సులో లూస్ జాతీయ జట్టుకు ఆడడం మొదలు పెట్టింది.[2] పురుషుల టెస్ట్ బ్యాట్స్మన్ జాక్వెస్ రుడోల్ఫ్తో ఆమెను లెగ్ స్పిన్ బౌలింగ్ ఆడమని ప్రోత్సహించాడు.[5]

2014లో ఆమె పాఠశాల చివరి సంవత్సరంలో లూస్ క్రికెట్ ఆడటంలో చాలా బిజీగా ఉండటంతో ఆమె పాఠశాలకు కేవలం మూడు నెలలు మాత్రమే గడిపింది.[7] ప్రిటోరియా విశ్వవిద్యాలయం, హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో జరిగిన జాతీయ జట్టు సమావేశంలో లూస్ కు స్పోర్ట్స్ సైన్స్ లో హయ్యర్ సర్టిఫికేట్ కోసం సంవత్సరానికి బదులుగా రెండేళ్లలో చదువుకోవచ్చని సౌకర్యం కలిపించారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం నుండి బర్సరీ సహాయంతో లూస్ 2015లో ఆ కోర్సు మొదలు పెట్టింది.[7] అయితే , ఆ విశ్వవిద్యాలయం ఆమెకి ప్రయోగాలకు ఏర్పాటు చేయలేకపోయింది, అందువల్ల ఆమెను కమ్యూనికేషన్ సైన్స్ అధ్యయనం చేయడానికి యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకు బదిలీ చేసారు.[6]

క్రికెట్ జీవితం

[మార్చు]

ఆమె 5 ఆగస్టు 2016న , ఆంగ్లేసీ రోడ్ క్రికెట్ గ్రౌండ్, ఐర్లాండ్ లో జరిగిన మహిళల వన్డే మ్యాచ్ లో హీథర్ నైట్ తర్వాత అర్ధ శతకం చేసి ఐదు వికెట్లు తీసిన రెండవ క్రీడాకారిణి గా నిలిచింది.[8][9][10] మహిళల వన్డే క్రికెట్లో ఒకే సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన అనీసా మహ్మద్ రికార్డును కూడా ఆమె సమం చేసింది, 2016లో 37 డిస్మిసల్స్ చేసింది.[11] 2016లో, క్లోయ్ ట్రియాన్ తో కలిసి ఆమె 142 పరుగులతో ఒక వన్డే లో అత్యధిక ఆరవ వికెట్ భాగస్వామ్య రికార్డును నెలకొల్పింది.[12]

మే 2017లో క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డులలో ఆమె 'ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గా ఎంపికైంది.[13] 2018 - 19 సీజన్ కు ముందు క్రికెట్ దక్షిణాఫ్రికా జాతీయ కాంట్రాక్ట్ పొందిన 14 మంది క్రీడాకారులతో ఆమె ఒకరు.[14] అక్టోబర్ 2018లో వెస్టిండీస్ లో జరిగిన 2018 ఐసీసీ మహిళా ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకి ఆమె ఎంపికైంది.[15] నవంబర్ 2018లో , ఆమె 2018 - 19 మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్ కోసం బ్రిస్బేన్ హీట్ జట్టులో ఎంపికైంది.[16][17] 2019 సెప్టెంబరులో దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 సూపర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం 'ఎమ్ వాన్ డెర్ మెర్వే XI' జట్టులో ఆమె ఎంపికైంది.[18][19]

జనవరి 2020లో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసిసి మహిళల టి20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఆమె ఎంపికైంది.[20] న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో లూస్ వన్డే క్రికెట్లో రెండు సార్లు ఆరు వికెట్లు తీసిన మొదటి బౌలర్గా నిలిచింది.[21] పది ఓవర్లలో 45 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్ల సిరీస్ ను 3 - 0తో గెలుచుకుంది.[22] ఆమె 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' కు ఎంపికైంది.[23] 23 జూలై 2020న లూస్ ను ఇంగ్లాండ్ పర్యటన ముందు ప్రిటోరియా శిక్షణ పొందడానికి దక్షిణాఫ్రికా 24 మంది మహిళల జట్టులో చేర్చారు.[24] జనవరి 2021లో పాకిస్తాన్తో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ లో లూస్ తన 100వ వికెట్ను తీసి , మహిళా వన్డేల్లో 1,000 పరుగులు చేసి 100 వికెట్లు తీసిన పదవ క్రికెటర్గా నిలిచింది.[25]

ఫిబ్రవరి 2022లో , కెప్టెన్ 'డేన్ వాన్ నికెర్క్' చీలమండ ఎముక చీలడంతో టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన తరువాత, న్యూజిలాండ్లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించింది.[26][27] 31 మార్చి 2022న ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో లూస్ తన 100వ ఒక రోజు మ్యాచ్ ఆడింది.[28] మే 2022లో దుబాయ్ జరిగిన 2022 'ఫెయిర్ బ్రేక్ ఇన్విటేషనల్' టి20'లో ఆమె 'టొర్నాడోస్ జట్టు' తరఫున ఏడు మ్యాచ్ లు ఆడి బార్మీ ఆర్మీ జట్టుతో 66 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.[2] ఇన్విటేషనల్ ఫైనల్లో ఆమె 'టోర్నడో' కోసం పరుగులు చేసి టోర్నమెంట్ - విజేత గా నిలిచింది.[29]

ఆమె 27 జూన్ 2022న దక్షిణాఫ్రికా మహిళా టెస్ట్ జట్టు తరఫున ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టెస్టుకు నాయకత్వం వహించింది.[30][31][32] ఆగస్టు 2022లో మహిళా కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం 'ట్రిన్బాగో నైట్ రైడర్స్' జట్టు కోసం విదేశీ క్రీడాకారిణిగా ఆమె సంతకం చేసింది.[33]

మూలాలు

[మార్చు]
  1. A video of Luus pronouncing her own name: Luus, Suné. "How do you pronounce Suné Luus?". Google. Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "Suné Luus". ESPNcricinfo. ESPN Inc. Retrieved 27 May 2022.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Absolut Krieket: Suné Luus – Dié Menlo-meisie mág moker!" [Absolute Cricket: Suné Luus - This Menlo girl can smash!]. www.menlopark.co.za (in ఆఫ్రికాన్స్). Archived from the original on 6 ఏప్రిల్ 2022. Retrieved 11 March 2022.
  4. Head, Tom (10 November 2018). "Sune Luus: Six things to know about the Proteas' spin sensation". The South African. Retrieved 11 March 2022.
  5. 5.0 5.1 5.2 5.3 "Sune Luus: part-time student, full-time South Africa women's cricket star". eNCA (in ఇంగ్లీష్). 22 February 2017. Archived from the original on 4 ఏప్రిల్ 2023. Retrieved 11 March 2022.
  6. 6.0 6.1 Team Female Cricket (13 October 2018). "EXCLUSIVE Interview with Sune Luus - South Africa's Spin Sensation". Female Cricket. Retrieved 11 March 2022.
  7. 7.0 7.1 "Reaping the benefits". SACA | South African Cricketers' Association. 13 January 2016. Retrieved 11 March 2022.
  8. "Luus' all-round brilliance underpins thumping SA win". ESPN Cricinfo. 5 August 2016.
  9. "Records | Women's One-Day Internationals | All-round records | A fifty and five wickets in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 3 May 2017.
  10. "1st ODI: Ireland Women v South Africa Women at Dublin, Aug 5, 2016 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 3 May 2017.
  11. "Records | Women's One-Day Internationals | Bowling records | Most wickets in a calendar year | ESPN Cricinfo". Cricinfo. Retrieved 3 May 2017.
  12. "Records | Women's One-Day Internationals | Partnership records | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 14 July 2017.
  13. "De Kock dominates South Africa's awards". ESPN Cricinfo. Retrieved 14 May 2017.
  14. "Ntozakhe added to CSA [[:మూస:As written]] contracts". ESPN Cricinfo. Retrieved 13 March 2018. {{cite web}}: URL–wikilink conflict (help)
  15. "Shabnim Ismail, Trisha Chetty named in South Africa squad for Women's WT20". International Cricket Council. Retrieved 9 October 2018.
  16. "WBBL04: All you need to know guide". Cricket Australia. Retrieved 30 November 2018.
  17. "The full squads for the WBBL". ESPN Cricinfo. Retrieved 30 November 2018.
  18. "Cricket South Africa launches four-team women's T20 league". ESPN Cricinfo. Retrieved 8 September 2019.
  19. "CSA launches inaugural Women's T20 Super League". Cricket South Africa. Archived from the original on 26 జనవరి 2020. Retrieved 8 September 2019.
  20. "South Africa news Dane van Niekerk to lead experienced South Africa squad in T20 World Cup". International Cricket Council. Retrieved 13 January 2020.
  21. "Luus shines as South Africa take ODI series 3-0". International Cricket Council. Retrieved 30 January 2020.
  22. "Sune Luus' six-wicket haul helps South Africa whitewash New Zealand". Women's Cricket. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
  23. "Luus leads Proteas Women to ODI clean-sweep". Cricket South Africa. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.
  24. "CSA to resume training camps for women's team". ESPN Cricinfo. Retrieved 23 July 2020.
  25. "Ismail, Luus combine to make it 3-0 after Wolvaardt's heroics with the bat". Women's CricZone. Retrieved 26 January 2021.
  26. "Lizelle Lee returns as South Africa announce experience-laden squad for Women's World Cup". Cricket South Africa. Retrieved 4 February 2022.
  27. "Injured Dané van Niekerk out of 2022 World Cup". ESPN Cricinfo. Retrieved 13 January 2022.
  28. "Luus, Lee to play 100th ODI in World Cup semi-final: 'It's an honour'". News24. Retrieved 31 March 2022.
  29. "CSA congratulates Luus and Khaka after FairBreak Invitational success". Cricket South Africa. 16 May 2022. Archived from the original on 16 మే 2022. Retrieved 27 May 2022.
  30. "Kapp, Lee and Jafta mark their return as South Africa announce squad for one-off Test and ODIs against England". Women's CricZone. Archived from the original on 16 November 2022. Retrieved 17 June 2022.
  31. "Only Test, Taunton, June 27 - 30, 2022, South Africa Women tour of England". Retrieved 27 June 2022.
  32. "No Dane van Niekerk for Commonwealth Games too, Luus to continue as South Africa captain". ESPN Cricinfo. Retrieved 15 July 2022.
  33. "Athapaththu, Khaka and Luus brought in for Women's CPL and 6ixty". ESPN Cricinfo. Retrieved 16 August 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=సనే_లూస్&oldid=4226790" నుండి వెలికితీశారు