సముద్రాల లక్ష్మణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సముద్రాల లక్ష్మణయ్య భాషాకోవిదులు, కవి.[1] అతను తిరుపతి లోని ఓరియెంటల్ కళాశాలలో సంస్కృత అధ్యాపకునిగా పనిచేసి పదవీవిరమణ చేసాడు. అతను వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని కళాశాలలలో సంస్కృత విభాగాన్ని సందర్శించి విద్యార్థులు, పండితుల ప్రయోజనం కోసం వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చాడు. [2]

జీవిత విశేషాలు

[మార్చు]

సముద్రాల లక్ష్మణయ్య 1939 జూన్ 8 న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, కటకయలకుంట గ్రామంలో జన్మించాడు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత అతను సాహిత్య శిరోమణి డిగ్రీ, సంస్కృతంలో ఎం.ఎ డిగ్రీని తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పండిట్ శిక్షణా కోర్సుకు హాజరయ్యాడు. అతను తిరుపతిలోని ఎస్.వి. ఓరియెంటల్ కళాశాలలో సాహిత్య అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరాడు. తరువాత అతను సాహిత్య విభాగానికి అధిపతి అయ్యాడు. అనంతరం అతనిని తిరుపతి తిరుమల దేవస్థానంలో ధర్మ ప్రచార పరిషత్ కు డిప్యూటీ సెక్రటరీగా ఏడున్నర సంవత్సరాల పాటు పనిచేసాడు. అతను పురాణ ప్రబోధ పరీక్షలను నిర్వహించడానికి నియమించారు. అతను భగవద్గీత ప్రాజెక్టు (2002-2OO7) కు స్పెషల్ ఆఫీసరు గా నియమించబడ్డాడు. పురాణ ఇతిహాసాల ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిగా అతను 2007 నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు. 11 ఎడిషన్లతో కూడిన శ్రీమద్భగవద్గీతను నాలుగు వ్యాఖ్యానాలతో ప్రచురించిన ఘనతను పొందాడు. అతను శ్రీమద్ వాల్మీకిని రెండు వ్యాఖ్యానాలతో సవరించాడు. వాటిలో మొదటి నాలుగు కాండలు ప్రచురించబడ్డాయి. మిగిలినవి తయారవుతున్నాయి. పురాణ ఇతిహాసాల ప్రాజెక్టులో భాగంగా అతను సుమారు 50 మంది పండితుల సహాయంతో సంస్కృతం నుండి తెలుగుకు వివిధ పర్వాలను అనువాదం చేసే పని జరుగుతోంది.

పురస్కారాలు

[మార్చు]
  • డాక్టర్ లక్ష్మణయ్యకు హైదరాబాలోని సంస్కృత బాషా ప్రచారిణి సభ, హైదరాబాదు నుండి బంగారు పతకం లభించింది.
  • రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుండి ప్రశస్తి పత్రం, వాచస్పతి బిరుదులను అందజేసింది.
  • పొట్టి శ్రీ రాములు తెలుగు విద్యాలయం నుండి ఉత్తమ పండిత పురస్కారం వచ్చింది.
  • చెన్నైలోని హిందీ భాషా ప్రచారసమితి నుండి తెలుగు సాహితి పురస్కారం.
  • ఉత్తమ పౌర పురస్కారాన్ని మాడభూషి అనంతశయనం ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ నుండి అందుకున్నాడు.
  • ఫైన్ ఆర్ట్స్ క్లబ్, తిరుపతి వారు స్పిరిటి ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రదానం చేసారు.

పదవులు

[మార్చు]
  • టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి[3]
  • ఎడిటర్ ఇన్ చీఫ్, తిరుపతి తిరుమల దేవస్థానములు
  • వేటూరి ప్రభాకర శాస్త్రి వాజ్ఞ్మయ పీఠం ప్రత్యేకాధికారి

రచనలు

[మార్చు]
  1. అన్నమాచార్య సంకీర్తనామృతము[4]
  2. హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి
  3. పోతన భాగవతము - ద్వితీయ స్కంధము - ద్వితీయ సంపుటము (అనువాదం)
  4. శ్రీ కారుణ్యానందస్వామి జీవితచరిత్ర[5]
  5. భర్తృహరి సుభాషితము - నీతి శతకము
  6. అన్నమయ్య పాటలు
  7. శ్రీ వేంకటేశ్వరుడు
  8. శ్రీ మలయాళయతీంద్రస్య ఉపదేశామృతం
  9. శ్రీ మలయాళస్వామి జీవిత చరిత్ర[6]
  10. శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారి జీవిత చరిత్ర
  11. రఘువంశము (కాళిదాసు)
  12. దశకుమారచరితసుషమ
  13. అమరవాణి
  14. పూర్ణాహుతి
  15. యోగవాసిష్ఠం (ప్రథమ, ద్వితీయ, తృతీయ)
  16. వామదేవమహర్షి

బిరుదులు

[మార్చు]
  1. మహోపాధ్యాయ
  2. వాచస్పతి
  3. బ్రహ్మర్షి[7]

మూలాలు

[మార్చు]
  1. "'గ్రంథం'.. భవితకు నిర్దేశం - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-06-06.
  2. "::Sri Venkateswara University::". www.svuniversity.edu.in. Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
  3. "ANNAMAIAH WAS A GREAT PHILOSOPHER: DR SAMUDRALA LAKSHMANAIAH_ అన్నమయ్య కీర్తనలు అజరామరం : డా|| సముద్రాల లక్ష్మణయ్య – TTD News" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
  4. "Annamacharya Sankeertanaamrutamu". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-06.
  5. Lakshmanaiah, Samudrala (1994). Swamy Karunyananda (in ఇంగ్లీష్). Sri Vyasasramam.
  6. Lakshmanaiah, Samudrala (1998). The Life and Work of Sri Malayalaswami (in ఇంగ్లీష్). Sri Vyasashram.
  7. "YouTube". www.youtube.com. Retrieved 2020-06-06.