సమ్మక్క బ్యారేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమ్మక్క బ్యారేజీ
సమ్మక్క బ్యారేజీ is located in Telangana
సమ్మక్క బ్యారేజీ
తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజీ
సమ్మక్క బ్యారేజీ is located in India
సమ్మక్క బ్యారేజీ
సమ్మక్క బ్యారేజీ (India)
అధికార నామంసమ్మక్క బ్యారేజీ
దేశంIndia
ప్రదేశంతుపాకులగూడెం, ఏటూరునాగారం మండలం, ములుగు జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు18°35′10″N 80°23′36″E / 18.58611°N 80.39333°E / 18.58611; 80.39333Coordinates: 18°35′10″N 80°23′36″E / 18.58611°N 80.39333°E / 18.58611; 80.39333
ఆవశ్యకతబహుళ ఉపయోగం
స్థితిUnder construction
నిర్మాణం ప్రారంభంఫిబ్రవరి 2017
ప్రారంభ తేదీజూన్ 2021 (Signifies date of water impounding, not yet formally inaugurated)
నిర్మాణ వ్యయం2,121 కోట్లు
యజమానిరిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులునీటిపారుదల & కాడ్ విభాగం, తెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజీ
నిర్మించిన జలవనరుగోదావరి నది
Height83 మీటర్లు
పొడవు1,132 మీటర్లు
Spillways48 (Radial lift gates)
Spillway capacity8,50,000 క్యూసెక్కులు
జలాశయం
సృష్టించేదిసమ్మక్క సాగర్
మొత్తం సామర్థ్యం6.94 టిఎంసీ
సమ్మక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
నిర్వాహకులుతెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్
Commission dateప్రతిపాదిత
TypeRun-of-the-river
టర్బైన్లు10 యూనిట్లు 24 మెగావాట్స్
Installed capacity240 మోగావాట్స్
వార్షిక ఉత్పత్తి786 MU (at 50% dependability) or 317 MU (at 90% dependability)

సమ్మక్క బ్యారేజీ[1][2][3] (తుపాకులగూడెం బ్యారేజ్) తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరి నది మీద ఉన్న బ్యారేజీ. దేవదుల ఆనకట్ట కింద 2,51,310 హెక్టార్ల సాగునీటి ప్రాంతం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద 3,04,000 హెక్టార్ల సాగునీటి ప్రాంతాలలో I & II దశల్లో 50 టిఎంసితో నీటి ఉంది.[4] ఇతర గ్రామాలకు తాగునీటిని అందించడానికి మరో 50 టిఎంసీ ఉపయోగించబడుతుంది.

ఈ ప్రాంతంలో సమ్మక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా 240 మెగావాట్స్ (10 యూనిట్లు 24 మెగావాట్స్) రన్ ఆఫ్ ది రివర్ జనరేషన్ సహాయంతో విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించబడుతోంది.

చరిత్ర[మార్చు]

ఈ బ్యారేజీని మొదట్లో కంఠనపల్లి బ్యారేజీ అని పిలిచేవారు. ప్రస్తుతం దేవదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ నుండి పూర్తి రిజర్వాయర్ లెవల్ తో +85.0 మీటర్ల వద్ద 17 కి.మీ దిగువన ఈ బ్యారేజీ ప్రతిపాదించబడింది.

గ్రామాల ముంపు, భూసేకరణకు సంబంధించిన అవరోధాలను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం 2016లో తుపాకులగూడెం బ్యారేజీని ప్రస్తుత ప్రదేశంలో నిర్మించాలని నిర్ణయించింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ నుండి +77.0 మీటర్లు వరకు అందజేయబడుతోంది. దాంతో ఈ ప్రదేశంలో 580.18 హెక్టార్ల నదీలో ఉండడంతోపాటు చుట్టుపక్కల 94 హెక్టార్ల భూమి మాత్రమే మునిగిపోతుంది.

2020, ఫిబ్రవరి 13న తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క పేరు మీద సమ్మక్క బ్యారేజీగా పేరు మార్చారు.[2][5] ఈ బ్యారేజీకి సమీపంలో ఏటూరునాగరం వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర లో గిరిజన దేవతలు సమ్మక్కను పూజిస్తారు.

నిర్మాణ వివరాలు[మార్చు]

2021 సంవత్సరం ప్రారంభంలో బ్యారేజీ సివిల్ పనులు పూర్తయ్యాయి.[6] 2021 జూన్ నెలలో[7] బ్యారేజీలో నీటిని నింపే ప్రక్రియ ప్రారంభమైంది. +85 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద 6.94 టిఎంసిల నీటిని నిల్వచేయాల్సి ఉండగా, రిజర్వాయర్ స్థాయిలో 70 నుండి 71 మీటర్ల వరకు 2.90 టిఎంసిల నీటిని నిల్వ చేయనున్నారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 71 మీటర్ల నుండి నీటిని ఉపయోగిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "Green Panel Gives Nod to Telangana's Rs 2,121 Cr Dam Project On Godavari". NDTV.com. Retrieved 13 September 2021.
  2. 2.0 2.1 "Telangana CM names Tupakulagudem barrage after tribal warrior goddess Sammakka". The New Indian Express. Retrieved 13 September 2021.
  3. "Tupakulagudem Barrage, Near : Eturnagaram Mandal, Warangal Dist - Projects - Rithwik Projects Pvt. Ltd". www.rithwikprojects.com. Retrieved 13 September 2021.
  4. "Smitha Sabharwal tells officials to expedite barrage works". Telangana Today. 22 November 2019. Retrieved 13 September 2021.
  5. "Council of Ministers for Telangana Government renames barrages". Chief Ministers Office, Telangana (Twitter). Retrieved 13 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Cap Sammakka barrage works: Smita Sabharwal". Telangana Today. 11 May 2021. Retrieved 13 September 2021.
  7. "జూన్‌లో 'సమ్మక్క సాగర్‌' జాతికి అంకితం". Sakshi. 2021-05-16. Retrieved 13 September 2021.