Jump to content

సయ్యద్ నయీముద్దీన్

వికీపీడియా నుండి
సయ్యద్ నయీముద్దీన్
సయ్యద్ నయీముద్దీన్ (2016)
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ 1944 (age 79–80)
జనన ప్రదేశం హైదరాబాదు
తెలంగాణ
భారతదేశం
ఆడే స్థానం డిఫెండర్
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
1962–1966 హైదరాబాదు నగర పోలీసు
1966–1968 తూర్పు బెంగాల్
1968–1970 మోహన్ బగన్
1970 తూర్పు బెంగాల్
1971–1973 మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
1973–? మోహన్ బగన్
197?–? మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
జాతీయ జట్టు
1964–1971 భారత ఫుట్‌బాల్‌ జట్టు
Teams managed
1982–1985 మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
1986 భారత ఫుట్‌బాల్‌ జట్టు
1990–1992 తూర్పు బెంగాల్
1992–1994 మోహన్ బగన్
1994–1996 తూర్పు బెంగాల్
1997–1998 భారత ఫుట్‌బాల్‌ జట్టు
2004–2005 మహీంద్రా యునైటెడ్
2005–2006 భారత ఫుట్‌బాల్‌ జట్టు
2007–2016 బ్రదర్స్ యూనియన్
2016 బ్రదర్స్ యూనియన్
2017 ఢాకా మహమ్మదన్
2018–2019 బ్రదర్స్ యూనియన్
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

సయ్యద్ నయీముద్దీన్ (జననం 1944), నయీమ్[1][2] తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్, మాజీ ఆటగాడు. భారత జాతీయ ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు.[3] మహీంద్రా యునైటెడ్,[4] బ్రదర్స్ యూనియన్, ఢాకా మహమ్మదన్,[5] బంగ్లాదేశ్ జాతీయ జట్టును నిర్వహించాడు. అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు రెండింటినీ గెలుచుకున్న ఏకైక క్రీడాకారుడు ఇతడు. భారత ఫుట్‌బాల్‌కు చేసిన కృషిని గుర్తించి 1997లో భారత ప్రభుత్వం అర్జున అవార్డును,[6] ఫుట్‌బాల్ కొరకు ద్రోణాచార్య అవార్డులను బహుకరించింది.

న్యూ ఢిల్లీలో 2017లో ఎఫ్ఐఎఫ్ఏ యు-17 ప్రపంచ కప్ ప్రారంభోత్సవంలో నయీముద్దీన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సన్మానించారు.

1970 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[7]

కోచ్ గా

[మార్చు]

1997లో నయీముద్దీన్ భారత కోచ్‌గా నియమించబడ్డాడు. 5–1తో మాల్దీవుల జట్టును ఓడించి దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కప్‌ను గెలుచుకోవడమేకాకుండా మొదటిసారి నెహ్రూ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు.[8] 1998 ఆసియా క్రీడలకు ముందు 1997 సెప్టెంబరు నుండి 1998 నవంబరు మధ్య ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండా జాతీయ జట్టు బాధ్యతలు నిర్వర్తించాడు. 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో జట్టును నిర్వహించాడు, ఆ టౌర్నమెంటులో భారత జట్టు రెండవ రౌండ్‌కు చేరుకుంది.[9][10]

1998 డిసెంబరులో ఆటల తర్వాత ఇతడు కోచ్ గా చేయలేదు. 2005లో భారత కోచ్‌గా సుఖ్వీందర్ సింగ్ నియమించబడగా, ఇతడు రెండవ స్థానంలో ఉన్నాడు.[11] 2006లో ఆసియా కప్‌కు అర్హత సాధించినప్పుడు జపాన్, యెమెన్‌పై సరిగా ఆడకపోవడంతో 2006లో కోచ్ పదవి నుండి నిష్క్రమించాడు.[3] 2007 నుండి 2017 వరకు, ఢాకాలోని బ్రదర్స్ యూనియన్ ప్రధాన కోచ్ గా ఉన్నాడు. గతంలో ముంబై ఫుట్‌బాల్ లీగ్‌లో బెంగాల్ ముంబై ఎఫ్.సి. జట్టును నిర్వహించాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. Sengupta, Somnath (25 July 2013). "Legends Of Indian Football : Sayeed Nayeemuddin". thehardtackle.com. Archived from the original on 6 December 2018. Retrieved 30 September 2021.
  2. "Nayeem showers praise on Bhutia". Archived from the original on 1 November 2018. Retrieved 30 September 2021.
  3. 3.0 3.1 Houghton poised to become India coach Archived 20 ఆగస్టు 2007 at the Wayback Machine, Rediff news, 27 May 2006.
  4. Nayak, Nicolai. "Rise of a new champion: When Mahindra United became the first Mumbai team to win the NFL title". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 6 November 2020. Retrieved 30 September 2021.
  5. Nayeemuddin wants to revive MSC The Daily Star. Retrieved 25 August 2021
  6. "Arjuna Award winners". Ministry of Youth Affairs and Sports. Archived from the original on 25 December 2007. Retrieved 30 September 2021.
  7. "Former India goalkeeper Bandya Kakade is no more". The Free Press Journal. 18 October 2012. Archived from the original on 13 July 2013. Retrieved 13 July 2013.
  8. What ails Indian football Archived 7 సెప్టెంబరు 2008 at the Wayback Machine, Frontline, July 2002.
  9. "Indian football team at the Asian Games: 1998 Bangkok". Sportskeeda. Retrieved 24 August 2021.
  10. "The Indian Senior Team at the 1998 Bangkok Asian Games:". indianfootball.de. Archived from the original on 19 ఫిబ్రవరి 2020. Retrieved 30 September 2021.
  11. Syed Nayeemuddin gets AIFF nod Archived 27 ఏప్రిల్ 2006 at the Wayback Machine, The Telegraph (Kolkata), 3 October 2005.
  12. Indian Football Hall of Fame: Syed Nayeemuddin Archived 19 జనవరి 2017 at the Wayback Machine indianfootball.de. Retrieved 30 September 2021

బయటి లింకులు

[మార్చు]