Jump to content

సరస్వతీ గ్రంథాలయం

వికీపీడియా నుండి
గ్రంథాలయం - ప్రతీకాత్మక చిత్రం

సరస్వతీ గ్రంథాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం, ముక్కామల గ్రామంలో వున్న లో వున్న గ్రంథాలయం, ఈ గ్రామ ప్రజలకే కాకుండా పరిసర గ్రామ ప్రజలకు కూడ విజ్ఞాన ప్రదాయిని. పూర్వం ఈ గ్రంథాలయం గ్రామ కంఠం లో వున్న రామాలయం లో నిర్వహించబడేది. ఈ గ్రామం లో జరిగే ఇతర ఉత్సవాలతో పాటు ప్రతి సంవత్సం నవంబరు నెలలో గ్రంథాలయ వారోత్సవాలు కూడ ఎంతో ఉత్సాహంగా జరుపుతారు.

కాలక్రమంలో మహానుభావులు యినపకొళ్ళ రాఘవరావు జ్ఞాపకార్థం అతని కుమారుడు యినపకొళ్ళ సుబ్బారావు ఆర్థిక సహాయంతో ఒక పెద్ద భవనంలోకి మార్చబడింది. వ్యవసాయదారులు ఎక్కువుగా వుండే ఈ గ్రామం లో వారికి వున్న ఏకైక కాలక్షేపం ఈ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో దినపత్రికలు, వార పత్రికలుతో పాటు ఎన్నో విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడ అందుబాటులో ఉన్నాయి

కాలక్రమం లో ఈ గ్రంథాలయం కూడ అభివృధ్ధి చెందింది. ఢిల్లీ దూరదర్శన్ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటు లోకి వచ్చిన కొత్తలో ముళ్ళపూడి అప్పారాయుడు, సుబ్బారావు ఎంతో నిస్వార్థంగా అందించిన ధన సహాయంతో ఈ గ్రంధాలయానికి ఒక టెలివిజన్ సమకూర్చడం జరిగింది. ఆనాటి నుండి ఇక్కడి ప్రజలకు ఎన్నో పత్రికలతో పాటు దూరదర్శన్ కార్యక్రమాలు కూడ అందుబాటులో వుండేవి.

మారుతున్న కాలానికి అణుగుణంగా ఈ గ్రామ ప్రజల నిస్వార్థ అంకిత భావంతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడుచున్న ఈ గ్రంథాలయం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా వుంటుందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]