సలేహ్ ముహమ్మద్ అల్లాదిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సలేహ్ ముహమ్మద్ అల్లాదిన్
జననం1931, మార్చి 3
హైదరాబాదు, తెలంగాణ
మరణం2011, మార్చి 20
అమృత్‌సర్‌, పంజాబ్
వృత్తిఖగోళ శాస్త్రవేత్త

డాక్టర్ హఫీజ్ సలేహ్ ముహమ్మద్ అల్లాదిన్ (1931, మార్చి 3 - 2011, మార్చి 20) తెలంగాణకు చెందిన ముస్లిం ఖగోళ శాస్త్రవేత్త.[1]

జననం, విద్య

[మార్చు]

సలేహ్ ముహమ్మద్ అల్లాదిన్ 1931, మార్చి 3న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు. అల్లాదిన్ 1963లో చికాగో విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. పూర్తిచేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

ప్రపంచంలోని ప్రసిద్ధ 100 మంది ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకడిగా నిలిచిన ఇతను భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాంకు విద్యా సలహాదారుగా పనిచేశాడు.[2] అనేక పుస్తకాలు, వందలాది వ్యాసాలు వ్రాసాడు. 50కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, ఖగోళశాస్త్రంలో అడ్వాన్స్‌డ్ స్టడీ సెంటర్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు.[3][4]

అల్లాదిన్ అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య, ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ప్లాస్మా సైన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఫర్ జనరల్ రిలేటివిటీ అండ్ గ్రావిటేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ వంటి అనేక శాస్త్రీయ సంఘాలలో ప్రముఖ సభ్యుడు.[5]

1894లో సూర్య, చంద్ర గ్రహణం

[మార్చు]

రంజాన్‌లో ప్రతి 22 సంవత్సరాలకు ఒకసారి సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తాయని, అయితే అవి ఒక నిర్దిష్ట ప్రాంతంలో సంభవించడం దాదాపు అసాధ్యమని, ఖాదియన్ పైన ఉన్న చివరి సూర్య, చంద్ర గ్రహణాలు 600 సంవత్సరాల క్రితం సంభవించాయని ఇతను చూపించాడు.

అవార్డులు

[మార్చు]

అనేక అవార్డులు, గుర్తింపులను సాధించాడు:

  • 1981: యూజీసీ న్యూఢిల్లీకి మేఘనాద్ సాహా అవార్డు
  • భారత్ ఎక్సలెన్స్ అవార్డు
  • ఫ్రెండ్‌షిప్ ఫోరమ్ ఆఫ్ ఇండియా

మరణం

[మార్చు]

ఇతను 2011, మార్చి 20న పంజాబ్ లోని అమృత్‌సర్‌లో మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "False rumour of Abdul Kalam's death in circulation". The Economic Times. 2011-03-22. ISSN 0013-0389. Retrieved 2023-02-10.
  2. "President of Ahmadiyya Muslim Community of India chapter and a famous scientist Dr. Hafiz Saleh Muhammad Alladin expired after brief illness at the Age of 80". The Times of India. 2011-03-21. ISSN 0971-8257. Retrieved 2023-02-10.
  3. "Educational advisor to Kalam dies in Amritsar - Indian Express".
  4. "[UPDATE] Abdul Kalam (Dr Hafiz Saleh Muhammad Alladin) Died, Not APJ Abdul Kalam | Breaking News". www.myvisitingcard.com. Archived from the original on 2011-03-25.
  5. 5.0 5.1 "Hafiz Saleh Muhammad Alladin Biography, Hafiz Saleh Muhammad Alladin Bio, Hafiz Saleh Muhammad Alladin Photos, Videos, Wallpapers, News". Archived from the original on 2012-07-08. Retrieved 2023-02-10.