సామజ వర గమన (కీర్తన)
Appearance
సామజ వర గమన ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.
ఈ కీర్తనను నటభైరవి జన్యమైన హిందోళ రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.[1]
కీర్తన
[మార్చు]- పల్లవి
సామజ వర గమన ! సాధు హృత్సార సాబ్జపాల ! కాలాతీత ! విఖ్యాత !
- అనుపల్లవి
సామని గమజ సుధామయ గాన విచక్షణ ! గుణశీల ! దయాలవాల ! మాంపాలయ;
భారతీయ సంస్కృతి
[మార్చు]- శంకరాభరణం (1979) సినిమాలో ఈ కీర్తనను వేటూరి సుందరరామమూర్తి పల్లవి, అనుపల్లవి లను అలాగే ఉంచి చరణాన్ని సందర్భాని కనుగుణం మార్చి రచించారు. దీనిని కె.విశ్వనాథ్ పెళ్ళిచూపుల పాటగా రాజ్యలక్ష్మి, చంద్రమోహన్ మీద చిత్రీకరించారు.[2]
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్ లో సామజ వర గమన పూర్తి కీర్తన.