నఠభైరవి రాగము
స్వరూపం
(నటభైరవి రాగము నుండి దారిమార్పు చెందింది)
నఠభైరవి రాగము కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త రాగము.[1] ఇది హిందుస్థానీ సంగీతంలో అసావరీ థాట్ రాగానికి సమానమైనది.
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R2 G2 M1 P D1 N2 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N2 D1 P M1 G2 R2 S)
ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము. ఇది 56 మేళకర్త షణ్ముఖప్రియ రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
ఉదాహరణలు
[మార్చు]- s:మారుతే నమోస్తుతే - రామదాసు కీర్తన.
- ఆనతిబెట్టితినని ఆయాస పడవద్దు - రామదాసు కీర్తన.
- నమ్మినవారిని మోసముచేయుట - రామదాసు కీర్తన.
నఠభైరవి జన్యరాగాలు
[మార్చు]నఠభైరవి రాగం లోని కొన్ని జన్య రాగాలు: భైరవి, ఆనందభైరవి, హిందోళం, జయంతశ్రీ.
ఆనందభైరవి రాగం
[మార్చు]- ఉదాహరణ
- పలుకే బంగారమాయెనా - రామదాసు కీర్తన
జయంతశ్రీ రాగం
[మార్చు]- ఉదాహరణ
- మరుగేలర ఓ రాఘవ - త్యాగరాజ కీర్తన
హిందోళ రాగం
[మార్చు]- ఉదాహరణ
- సామజ వర గమన - త్యాగరాజ కీర్తన
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్