పలుకే బంగారమాయెనా
Appearance
పలుకే బంగారమాయెనా ఒక ప్రాముఖ్యం చెందిన కీర్తన. దీనిని భక్త రామదాసు రచించారు.
ఈ కీర్తనను నటభైరవి జన్యమైన ఆనందభైరవి రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.[1]
కీర్తన
[మార్చు]ప: పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||
చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||
చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||
చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||
.........................................................
..........................................................
భారతీయ సంస్కృతి
[మార్చు]- అందాల రాముడు (1973) సినిమా కోసం ఈ కీర్తనను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేశారు.
- శంకరాభరణం (1979) సినిమా కోసం కె.వి.మహదేవన్ స్వరకల్పనలో వాణీ జయరాం గానం.
- శ్రీరామదాసు (సినిమా) (2006) కోసం కె.ఎస్.చిత్ర, ఎం.ఎం.కీరవాణి గానం.[2]
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్ లో పలుకే బంగారమాయెనా పూర్తి కీర్తన.
మూలాలు
[మార్చు]- ↑ కర్ణాటిక్ సైట్ లో పలుకే బంగారమాయెనా కీర్తన సాహిత్యం.
- ↑ "Paluke Bangaramayena Song Lyrics in Telugu, Sri Ramadasu- పలుకే బంగారమాయెనా Song Lyrics | LyricsTape". www.lyricstape.com. Retrieved 2024-10-06.