సామల వేణు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సామల వేణు
Samala venu.jpg
సామల వేణు చిత్రం
జననం
సామల వేణు

ఇతర పేర్లుసామల వేణు
విద్యఎం.ఎస్సీ, పబ్లిక్ రిలేషన్‌లో పోస్టుగ్రాడ్యుయేట్
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
సుపరిచితుడుఇంద్రజాలికుడు,హిప్నాటిస్టు
తల్లిదండ్రులుసామల శ్రీనివాస్, సుగుణ
వెబ్‌సైటుhttp://www.samalavenu.com/
నోట్సు
1991లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదుచేసుకున్నారు

సామల వేణు ప్రసిద్ధ ఇంద్రజాలికుడు, హిప్నాటిస్టు. 1991లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదుచేసుకున్న వేణు ఇప్పటివరకు 7000లకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన హైదరాబాదులో నివాసముంటున్నారు.ఆయన సామల శ్రీనివాస్,సుగుణ దంపతులకు జూలై 6 1967 న హైదరాబాదులోని కాచిగూడలో జన్మించారు. ఆయన సహోదరులలో పెద్దవాడు. ప్రాథమిక విద్యను కాచిగూడలోని లాల్ బహాదుర్ స్కూల్ లో చదివారు.[2] ఆయన ఎం.యస్.సి, పబ్లిక్ రిలేషన్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ లను పూర్తిచేసారు[3].ఆయన తండ్రి భవనాల శాఖలో ఇంజినీర్ గా పనిచేసేవారు. "బాగా చదువుకొని అమెరికాకు వెళ్లవచ్చు కదా!" అనేవారు వారి నాన్న. అమ్మ సుగుణ కూడా నాన్నకు కోరస్ పలికేది. అమెరికా ఏమిటి...ఎన్నో దేశాలకు వెళతాను అని వేణు అనేవారు. ఎలా మాట నిలబెట్టుకోవాలా అని ఆలోచించి ఇంద్రజాలం వైపు మనస్సు మళ్ళించారు. తొలి రోజుల్లో తొలి ట్రిక్‌ను బి.వి.పట్టాభిరాం దగ్గర నేర్చుకున్నారు. కలకత్తా వెళ్లి ప్రసిద్ధ మెజీషియన్‌లు పీసీ సర్కార్, కేలాల్‌ల దగ్గర శిక్షణ తీసుకున్నారు. 2003లో హైదరాబాద్‌లో మెజీషియన్స్ అకాడమీ పెట్టారు. ఇప్పటి వరకు 30 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 1993లో కెనడాలో తొలి అంతర్జాతీయ ఇంద్రజాల పోటీలో పాల్గొన్నారు.[4] 'ఛూ..మంతర్' పేరుతో సికింద్రాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మెజీషియన్స్ సమ్మేళనం- 2014లో అంతర్జాతీయ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ చేతుల మీదుగా మ్యాజిక్ ఆస్కార్‌గా పిలుచుకునే మెర్లిన్ అవార్డ్‌ను అందుకున్నారు. [5] ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫర్ మ్యాజిక్ -2014నందు వేణు 36 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన చేసినందుకు ఈ అవార్డును అందిస్తున్నట్టు ఇంటర్నేషనల్ మెజీషియన్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలో అతికొద్దిమందికే ఈ మెర్లిన్ అవార్డును ఇప్పటివరకు ప్రదానంచేశారు. మనదేశంలో ఈ అవార్డును మేజిషియన్ సర్కార్ తర్వాత అందుకొన్న రెండో వ్యక్తి సామల వేణు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'ఇంద్రజాలం' లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[6] రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ దేశాలనుంచి కూడా అవార్డులు సాధించారు. 1996లో చూమంతర్ టైటిల్, 1988-89లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు అందుక్నురు. ఇక 1985-86లో ఉస్మానియానివర్సిటీ సాంస్కతిక రాయబారిగా వ్యవహరించారు. వేణు సారథ్యంలో దేశంలోనే తొలిసారిగా తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరు నెలల మెజిషియన్ కోర్స్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అవార్డులు[3][మార్చు]

అంతర్జాతీయ అవార్డులు[మార్చు]

 • 1995 : ఇండో అమెరికన్ యూత్ అవార్డు, ఫెదెరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ కౌన్సిల్-యు.ఎస్.ఎ
 • 2004 : పాల్ హారిస్ ఫెలోషి, లండన్.

జాతీయ అవార్డులు(భారత ప్రభుత్వం)[మార్చు]

 • 1993 : నేషనల్ యూత్ అవార్డు, భారత ప్రభుత్వంచే.

ఇతర జాతీయ అవార్డులు[మార్చు]

 • 1987-88 బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు, రెడ్ క్రాస్ సొసైటీ వారిచే.
 • 1988-89 బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు, రెడ్ క్రాస్ సొసైటీ వారిచే.
 • 1990 - బెస్ట్ మెజీసియన్ అవార్డు, ఇండియన్ మెజీషియన్స్ సొసైటీ వారిచే.
 • 2002 - జాధు శిరోమణి , ఇండియన్ బ్రదర్‌హుడ్ మెజీషియన్స్,న్యూఢిల్లీ.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు[మార్చు]

 • 1991 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే స్టేట్ యూత్ అవార్డు.
 • 2004 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం.

ఇతర రాష్ట్ర అవార్డులు[మార్చు]

 • 1985-86 ఆంధ్రా బాలానంద్ మేజిక్ స్కూల్ వారిచే బెస్ట్ మాజిక్ స్టూడెంట్ అవార్డు.
 • ఆంధ్రప్రదేశ్ మాజిక్ అకాడమీ వారిచే జాదూ మహావీర్ అవార్డు.
 • ఉస్మానియా విశ్వవిద్యాలయ కల్చరల్ అంబాసిడర్.
 • 1992 - జైసీస్ క్లబ్ ఆఫ్ హైరదాబాదు వారిచే బెస్ట్ అవుట్ స్టాండిగ్ పెరఫార్మెన్స్ అవార్డు.

మూలాలు[మార్చు]

 1. ఇంద్రజాలికుడు వేణుకు మెర్లిన్ పురస్కారం
 2. "I impressed girls with magic tricks". హన్స్ ఇండియా. 2013-08-21.
 3. 3.0 3.1 "Samala Venu". x prore magic. Archived from the original on 2014-08-15. Retrieved 2015-07-05.
 4. నేను గాని అబ్రకదబ్ర గాని అంటే...
 5. "మెజీషియన్ సామల వేణుకు మెర్లిన్ అవార్డు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-05.
 6. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సామల_వేణు&oldid=3269452" నుండి వెలికితీశారు