సాయిబాబాగౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'పద్మశ్రీ' డాక్టర్ ఎ.సాయిబాబా గౌడ్ సుప్రసిద్ధ నేత్రవైద్యుడు.

జీవితం[మార్చు]

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్ స్వంత ఊరు. ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. నాన్న నర్సప్పగౌడ్, అమ్మ దేవమ్మ నిరక్షరాస్యులు. పదవ తరగతిదాకా ఆలంపూర్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో పి.యు.సి., గాంధీ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్. భార్య జ్యోతి. అబ్బాయి అద్వైత సాయి, అమ్మాయి గ్రీష్మలు వైద్యవృత్తిని అభ్యసిస్తున్నారు.

సేవలు - పురస్కారాలు[మార్చు]

1992లో హైదరాబాద్‌లోని బేగంపేటలో 'దేవ్‌నార్' బ్లైండ్ స్కూలు స్థాపించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను నిర్వహించారు. 1988లో దేశంలోనే తొలిసారిగా ఆఫ్తల్మాలజీలో (ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి) పి.హెచ్.డి. పట్టాపొందారు. అంధుల కోసం కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చారు. 2004, 2008 సంవత్సరాలకు రాష్ట్రపతి అవార్డును వచ్చింది. భగవద్గీతను బ్రెయిలీ లిపిలోకి అనువదించారు. ఆపని 2004 లో 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు'లోకి ఎక్కింది. అంధులు స్వంతంగా ఓటు వేసుకునే విధానాన్ని రూపొందించి ఆసిఫ్‌నగర్ ఉపఎన్నికల్లో ఉపయోగించారు. గత 30 ఏళ్లుగా కుష్టురోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. అంధుల కోసం బన్సీలాల్‌పేటలో ఫిజియోథెరపీ జూనియర్ కాలేజీని కూడా నడుపుతున్నారు.

మూలాలు[మార్చు]