Jump to content

సింగం123

వికీపీడియా నుండి
సింగం123
దర్శకత్వంఅమిత్ నాయర్
రచనడైమండ్ రత్నమ్ (మాటలు)
స్క్రీన్ ప్లేమంచు విష్ణు
కథమంచు విష్ణు
నిర్మాతమంచు విష్ణు
మంచు మోహన్ బాబు (సమర్పణ)
తారాగణంసంపూర్ణేష్ బాబు
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుయంఆర్ వర్మ
సంగీతంశేషు
పంపిణీదార్లు24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
5 జూన్ 2015 (2015-06-05)
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్10 లక్షలు

సింగం123 అమిత్ నాయర్ దర్శకత్వం వహించిన 2015 భారతీయ తెలుగు భాషా యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించాడు. ఈ చిత్రంలో సంపూర్నేష్ బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం 2015 జూన్ 5 న మిశ్రమ సమీక్షలతో విడుదలైంది కాని బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ చిత్రం సింగం సిరీస్ యొక్క అనుకరణ.[1]

సింగం 123 (సంపూర్ణేష్ బాబు) సమాజంలో నేరాలను సహించలేని శక్తివంతమైన పోలీసు. అతని విజయవంతమైన ట్రాక్ రికార్డ్ కారణంగా, ప్రభుత్వం అతన్ని సింగరాయకొండ అనే ప్రదేశానికి బదిలీ చేస్తుంది. అక్కడ, అతను అనేక దుశ్చర్యలకు పాల్పడిన నేరస్థుడు లింగం (భవానీ) ను ఎదుర్కొంటాడు. ఒక మంచి రోజు, సింగం తన చట్టవిరుద్ధ కార్యకలాపాలన్నింటినీ అంతం చేస్తానని లింగం వద్ద సవాలు విసిరాడు.

ఈ ఉద్దేశ్యంతో లింగం, అతని మద్దతుదారులను నాశనం చేయడానికి సింగం ఒక మిషన్ ప్రారంభిస్తాడు. ఈ ప్రక్రియలో, అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. వాటిని ఒక్కొక్కటిగా అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. సింగం తన మిషన్ ని పూర్తి చేయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించగలరా? లేదా ఈ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను అధిగమించడంలో అతను విఫలమవుతాడా? అది మిగిలిన కథలో ఉంటుంది.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Not again!". The Hindu.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సింగం123&oldid=3846382" నుండి వెలికితీశారు