సింగూరు జలాశయం
సింగూరు జలాశయం | |
---|---|
ప్రదేశం | సింగూర్, మెదక్ జిల్లా, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°44′59″N 77°55′40″E / 17.7496°N 77.9278°E |
రకం | జలాశయం |
సరస్సులోకి ప్రవాహం | మల్లన్నసాగర్ ప్రాజెక్టు |
వెలుపలికి ప్రవాహం | నిజాం సాగర్ |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
సింగూరు జలాశయం అనేది తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో మంజీరా నదిపై ఉన్న సింగూర్ డ్యామ్ బ్యాక్ వాటర్ కోసం నిర్మించిన జలాశయం. ఇది హైదరాబాదు నగరానికి నిరంతర తాగునీటి వనరుగా ఉంది.[1][2] ఈ జలాశయానికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుండి ఇన్ ఫ్లో ఉండగా, నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఔట్ ఫ్లో ఉంది.[3]
సామర్థ్యం
[మార్చు]ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1717.93 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలుగా ఉంది. ఈ జలాశయంలోకి నీటి నిలువ కారణంగా, సింగూరు ఆనకట్ట దిగువ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు తాగునీరు అందుకుంది.[4]
సాగునీరు
[మార్చు]మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో సింగూర్ ప్రాజెక్టుకు అనుసంధానించి నీటిని సరఫరా చేయడంద్వారా ఈ జలాశయం కిందనున్న ఆయకట్టుకు రెండు పంటలకు నీరందుతుంది. ఈ జలాశయం కింద దాదాపు 60 వేల ఎకరాలు ఉంది. ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ లలో రైతులు అవసరాన్ని బట్టి ఈ జలాశయం నుండి దశల వారీగా నీటిని విడుదల చేస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ TNN (2003-05-31). "Water twice a week from June 15". The Times of India. Archived from the original on 2012-09-16. Retrieved 2022-04-23.
- ↑ "End to water blues in sight". 2003-07-29. Archived from the original on 2012-11-10. Retrieved 2022-04-23.
- ↑ "'మంజీరా'లో సింగూరు నీటి నిల్వలు". Sakshi. 2014-04-05. Archived from the original on 2022-04-23. Retrieved 2022-04-23.
- ↑ "సగం నిండిన సింగూరు ప్రాజెక్టు". EENADU. 2020-09-19. Archived from the original on 2022-04-23. Retrieved 2022-04-23.