సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్
రకం | కేంద్ర రైల్వే శాఖ |
---|---|
పరిశ్రమ | ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ముద్రణ |
స్థాపన | 1879 |
ప్రధాన కార్యాలయం | , |
సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో ఉన్న రైల్వే ప్రింటింగ్ ప్రెస్. 144 ఏళ్ళ క్రితం నిజాం పాలనలో ఏర్పాటైన ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫామ్స్ డిపార్టమెంట్ గా ఈ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించబడింది. రైల్వే రిజర్వుడు, అన్ రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ఈ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించబడేవి. 2023 మే నెలలో ఈ ప్రెస్ మూతబడిపోయింది.[1]
చరిత్ర
[మార్చు]1870లో ఆవిర్భవించబడిన నిజాం స్టేట్ రైల్వేకు సంబంధించిన రైలు టికెట్ల ముద్రణకోసం 1879లో సికింద్రాబాదులో ఈ ప్రెస్ ఏర్పాటుచేయబడింది.[2] ఈ ప్రెస్ ప్రారంభంలో 1,500మంది ఉద్యోగులుండేవారు.
మూసివేత
[మార్చు]రైల్వేశాఖ టికెట్ల జారీలో డిజిటలైజేషన్ తీసుకురావడంతో ఆన్లైన్ టికెట్ల విక్రయం 80 శాతానికి చేరగా, ఉద్యోగుల సంఖ్య 169కి తగ్గింది. ఆన్లైన్ లో టిక్కెట్ల విక్రయం జరుగుతున్న కారణంగా రైల్వే బోర్డు భావించి ప్రెస్ ను మూసేసింది.[3] రైలు టికెట్ల విధానం పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యేంతవరకు రిజర్వుడు, అన్ రిజర్వుడు టికెట్ల ముద్రణను ఔట్సోర్సింగ్ కు ఇవ్వబడింది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసి ఇతర విభాగాల్లో నియమించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "144ఏళ్ల చరిత్రకు రెడ్ సిగ్నల్". EENADU. 2023-05-06. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-15.
- ↑ "Railways to shut down Nizam-era SCR press in Secunderabad". The Times of India. 2019-07-08. ISSN 0971-8257. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
- ↑ Kumar, S. Vijay (2023-05-10). "Indian railways to go ahead with closure of five printing presses". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2023-05-11. Retrieved 2023-05-15.
- ↑ M, Praveen. "సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ మూసివేత". Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.