సిటీ మాంటిస్సోరి స్కూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
City Montessori School
सिटी मॉन्टेसरी स्कूल, लखनऊ
Academic block.jpg
స్థానం
,
సమాచారం
రకంRegistered Not-for-Profit Non-Governmental Society
Mottoహిందీ: जय जगत
(Victory to the World)
Founded1959
స్థాపకులుJagdish Gandhi
Bharti Gandhi
విద్యార్ధుల సంఖ్యNearly 52,000
పరీక్షల బోర్డుCouncil for the Indian School Certificate Examinations (CISCE)
Websitehttp://www.cmseducation.org

సిటీ మాంటిస్సోరి స్కూల్ ఇది ప్రపంచంలో మరే పాఠశాలలో లేనంత మంది విద్యార్థులు ఉన్న పాఠశాలగా గుర్తింపు పొందినది. అందుకే ఈ పాఠశాల గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది[1]. 2015 లో ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 52,000 [2].


పాఠశాల స్థాపకుడు[మార్చు]

డాక్టర్ జగదీష్ గాంధీ ఈ పాఠశాల స్థాపనకు మూల కారకుడు. ఇతడు 1936 నవంబరు 10 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని ఆలిగడ్ కు చెందిన బారాసోలి గ్రామంలో జన్మించారు. ఇతను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినా చదువు పట్ల తనకున్న ప్రేమతో వినోబాభావే, గాంధీజీల స్ఫూర్తితో ఉన్నత విద్యను పిల్లలకు అందించాలనే తపనతో తన భార్యతో కలసి 1956 లో ఈ పాఠశాలను స్థాపించారు[3]. కేవలము 300 వందల రూపాయల పెట్టుబడితో ... 5 గురు విద్యార్థులతో ఈ బడి ప్రారంబమైనది. వీరు ప్రపంచ శాంతి కార్యకర్తగా ఎన్నో దేశాలు తిరిగారు. విద్య ముఖ్య విషయంగా ఎన్నో వ్యాసాలు వ్రాసి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇతని భార్య భారతి ఈ పాఠశాల అద్యాపక రాలుగా, ప్రిన్సిపాలుగా పనిచేశారు. ఈ సమయంలో ఈ పాఠశాల లఖన్ పూర్ నగరమంతటా 20 శాఖలుగా విస్తరించింది[4].


భోధన[మార్చు]

ఈ బడిలో ప్రపంచ శాంతి గురించి, మరెన్నో విషయాల గురించి భోదిస్తారు. ఈ బడి కార్యకర్తలు గ్రామాలలో తిరుగుతూ నిరుపేదల అవసరాలను గుర్తించి డాక్యుమెంటరీలు తీసి ప్రభుత్వ సంస్థలకు పంపి పేదలకు సహకారం అందేలా కృషి చేస్తారు.

ఫాఠశాల నేటి పరిస్థితి[మార్చు]

ఈ పాఠశాలలో ప్రస్తుత విద్యార్థుల సంఖ్య.... 45,000, ఉపాద్యాయులు ...2500., కంప్యూర్లు... 3700, గదులు ...1000.

మూలాలు[మార్చు]

  1. "Largest school by pupils". Guinness World Records. 9 August 2010. Retrieved 20 Nov 2015.
  2. Overdorf, Jason (16 December 2015). "52,000 students and 1,050 classrooms: inside the world's largest school". The Guardian. ISSN 0261-3077. Retrieved 14 March 2016.
  3. "Largest school by pupils". Guinness World Records. 9 August 2010. Retrieved 20 Nov 2015.
  4. School, City Montessori. "City Montessori School". cmseducation.org.

ఇతర వనరులు[మార్చు]

  • బాల భారతం.... పత్రిక. ఆగస్టు 2015.