సిని శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిని శెట్టి
జననం
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి, మోడల్, విశ్వసుందరి

సిని శెట్టి (ఆంగ్లం: Sini Shetty) ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని కైవసం చేసుకున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల అమ్మాయి.[1] అయితే సిని శెట్టి పుట్టి, పెరిగింది ముంబై. ఆమె భరతనాట్య కళాకారిణి కూడా. గతంలో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ కోసం రూపొందించిన యాడ్ లో సిని శెట్టి నటించింది.

చదువు[మార్చు]

ముంబైలో స్థిరపడిన కన్నడ కుటుంబంలో 2001లో సిని శెట్టి జన్మించింది. ఆమె తల్లి హేమ శెట్టి. తనకు సోదరుడు షికిన్ శెట్టి ఉన్నాడు. ముంబైలోని విద్యావిహార్ లోని ఎస్.కె. సోమయ్య డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ) కోర్స్ చేస్తోంది.

ఫెమినా మిస్ ఇండియా 2022[మార్చు]

58వ ఫెమినా అందాల పోటీలు ముంబైలోని రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్‌లో 2022 జూలై 3న జరిగాయి. ఇందులో అనేక రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. ఇందులో కర్ణాటకకు చెందిన సిని శెట్టిని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ప్రకటించారు. కాగా రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నర్ అప్ గా, ఉత్తరప్రదేశ్ కు చెందిన షినతా చౌహాన్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. తెలంగాణకు చెందిన ప్రగ్యా అయ్యగారి నాలుగో స్థానంలో నిలిచింది.

ఈ పోటీలు ఆరుగురు న్యాయమూర్తుల సమక్షంలో జరిగాయి. వీరిలో మలైకా అరోరా, నేహా ధూపియా, డినో మోరియా, రాహుల్ ఖన్నా, రోహిత్ గాంధీ, షమక్ డాబర్ ఉన్నారు. ఇప్పటివరకు మిస్ ఇండియా టైటిల్‌ నెగ్గిన లారా దత్తా, సారా జేన్ డయాస్, నఫీసా జోసెఫ్, సంధ్యా ఛిబ్, రేఖ హండె, లిమారైనా డిసౌజా కర్ణాటకకు చెందినవారే కావడం గమనార్హం.

మూలాలు[మార్చు]

  1. "miss india 2022, Miss India 2022 : ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి.. తెలంగాణ అమ్మాయికి నాలుగో స్థానం.. - miss india 2022 winner is sini shetty form karnataka know here everything about her - Samayam Telugu". web.archive.org. 2022-07-04. Archived from the original on 2022-07-04. Retrieved 2022-07-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)