సి.ఆర్. అయ్యున్ని
సి.ఆర్. అయ్యున్ని | |
---|---|
జననం | త్రిస్సుర్ | 1891 అక్టోబరు 15
మరణం | 1961 జనవరి 21 త్రిస్సుర్ |
జాతీయత | భారతదేశం |
విద్య | ఎంఎ ఎల్ఎల్ బి |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, కింగ్డమ్ ఆఫ్ కొచ్చిన్ మంత్రి, లోక్ సభ సభ్యుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత జాతీయోద్యమం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | అన్నై (కుంజన్నం) అయ్యున్ని |
చలక్కల్ రప్పై అయ్యున్ని (సి.ఆర్. అయ్యున్ని) (1891–1961) కొచ్చిన్ రాజ్యంలో ప్రముఖ మంత్రి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. కేరళలోని త్రిసూర్ లో న్యాయవాదిగా పనిచేశాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ లో సభ్యుడు. 1954 లో జరిగిన మొదటి భారతీయ సాధారణ ఎన్నికల తర్వాత పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశాడు. అతను, అతని భార్యతో కలిసి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇలా ఎన్నికైన మొదటి జంట వీరిదే.[1][2][3]
జననం, విద్య
[మార్చు]అయ్యున్ని 15 అక్టోబర్ 1891 న జన్మించాడు. అతని తండ్రి శ్రీ రప్పాయి. అతను త్రిచూర్ మహారాజా కళాశాలలో పాఠశాల విద్యను, ఎర్నాకుళం మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో ఉన్నత విద్యను, మద్రాస్ లోని త్రివేండ్రంలో న్యాయవాద విద్యను పూర్తి చేశాడు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]అతను కాంగ్రెస్ కార్యకలాపాలతో పాటు త్రిచూర్‌లో న్యాయవాదిగా పని కూడా చేశాడు. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్, మలబార్ బ్యాంక్, కొచ్చిన్ రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి బ్యాంకింగ్ సంస్థలను ప్రోత్సహించడంలో ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు. త్రిచూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, త్రిచూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సివిల్ లిబర్టీస్ యూనియన్ ప్రెసిడెంట్, మేనేజింగ్ కమిటీ చైర్మన్, ఇండో-మెర్కంటైల్ బ్యాంక్, కొచ్చిన్ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, కెపిసిసి సభ్యుడు, కొచ్చిన్ డిసిసి సభ్యుడు వంటి ఇతర చాలా రకాలైన బాధ్యతలు ఆయ్యున్ని నిర్వహించాడు.[5]
మరణం
[మార్చు]అయ్యున్ని 21 అక్టోబర్ 1961 న తుది శ్వాస విడిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ MP, Iyyunni Chalakka. "Iyyunni Chalakka MP". loksabhaph.nic.in. Retrieved 16 September 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ MP, Iyyunni Chalakka. "Iyyunni Chalakka MP". www.latestly.com. Retrieved 16 September 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ MP, Iyyunni Chalakka MP. "Iyyunni Chalakka MP". www.indiavotes.com. Retrieved 16 September 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ MP, Iyyunni Chalakka. "Iyyunni Chalakka MP". entranceindia.com. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 16 September 2020.
- ↑ https://entranceindia.com/election-and-politics/shri-chalakka-r-iyyunni-member-of-parliament-mp-from-trichur-travancore-cochin-biodata/%7Curl-status=live%7Carchive-url=%7Carchive-date=%7Caccess-date=16[permanent dead link]