సి.సుమలత
| సి.సుమలత | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 13 అక్టోబర్ 2021 -13 నవంబర్ 2023 | |||
| నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1972 ఫిబ్రవరి 5 నెల్లూరు , ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | నాగార్జున యూనివర్సిటీ | ||
చిల్లకూరు సుమలత భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది.[1] [2]ఆమె అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది.[3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సి.సుమలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరులో 1972 ఫిబ్రవరి 5లో జన్మించింది. ఆమె 1995లో న్యాయశాస్త్రం కోర్సు పూర్తి చేసి నాగార్జున యూనివర్సిటీ నుంచి ‘రైట్ టు టైమ్‌లీ జస్టిస్’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేసింది.[4]
వృత్తి జీవితం
[మార్చు]సి.సుమలత 2005లో జూనియర్ సివిల్ జడ్జిగా నియమితురాలై జిల్లా జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2007 అక్టోబరు 25న జిల్లా జడ్జిగా మదనపల్లెలో బాధ్యతలు చేపట్టింది. ఆమె కర్నూలు, అనంతపురం, గుంటూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసి 2019లో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె ‘సత్వర న్యాయం’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకుంది. జస్టిస్ చిల్లకూరు సుమలత యావజ్జీవ కారాగార శిక్ష తీర్పును తెలుగులో రాసిన మొదటి జడ్జి సి.సుమలత సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 సెప్టెంబరు 16న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు ఉదయ్ యూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై[5][6]2023 నవంబర్ 13న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యింది.[7][8][9][10]
జస్టిస్ సి.సుమలతను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి 2025 మే 26న సిఫారసు చేసింది.[11][12]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Namasthe Telangana (13 October 2021). "ఏడుగురు కొత్త జడ్జీలకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 14 October 2021. Retrieved 15 October 2021.
- ↑ ETV Bharat News (15 October 2021). "హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
- ↑ Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ V6 Velugu (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (19 August 2021). "సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Andhrajyothy (14 November 2023). "తెలంగాణకు చెందిన ఇద్దరు సహా ఐదుగురు హైకోర్టు జడ్జిల బదిలీ". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Namasthe Telangana (14 November 2023). "ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జీల బదిలీ". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత ప్రొఫైల్స్". Sakshi. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
- ↑ "బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సుమలత". Eenadu. 24 November 2023. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
- ↑ "హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు". Andhrajyothy. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
- ↑ "Supreme Court Collegium recommends transfer of 21 High Court judges: Check list here" (in Indian English). The Hindu. 27 May 2025. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.