సీలింగ్ ఫ్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1962 లో బిగించిన ఈ సీలింగ్ ఫ్యాన్ ఎటువంటి అంతరాయం లేకుండా, మరమ్మత్తు లేకుండా సాఫీగా పనిచేస్తూనే ఉంది.
రెండు రెక్కల ఫ్యాన్

ఇంటి పై కప్పుకు లోపలి భాగాన గాలి కొరకు బిగించబడిన సాధనాన్ని సీలింగ్ ఫ్యాన్ అంటారు. దీనిని సాధారణంగా గది మధ్య భాగంలో బిగిస్తారు. ఫ్యాన్ కు మధ్య భాగాన ఉన్న ఇరుసుకు రెక్కలు బిగించబడి ఉంటాయి. ఫ్యాన్ లోపల ఉన్న విద్యుత్ యంత్రానికి విద్యుచ్ఛక్తి సరఫరా అయినపుడు, మోటారు తిరిగి, దానికి బిగించిన రెక్కలు తిరిగి గాలిని తోస్తాయి. సీలింగ్ ఫ్యానుకు మూడు నుంచి ఐదు రెక్కలు ఉంటాయి.

పనిచేసే విధానం

[మార్చు]

సీలింగ్ ఫ్యాన్లో విద్యుచ్చక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. గది కప్పు లోభాగం నుండి వ్రేలాడ దీయబడి ఉంటుంది. దీని మధ్య భాగంలో విద్యుత్ మోటారు ఉంటుంది. ఈ మోటారు చుట్టూ గల స్వేచ్ఛగా తిరిగే చక్రమునకు కొంచెం కోణంలో వంచబడిన రెక్కలు బింగింపబడి ఉంటాయి. ఈ విధంగా రెక్కలు వంచబడటం వల్ల ఫ్యాన్ తిరిగినపుడు ఇవి పైన గల గాలి క్రిందికి తోస్తాయి. సీలింగ్ ఫ్యాన్లో గల ఇనుప కోర్ కు రాగి తీగ అనేక సార్లు చుట్టబడి ఉంటుంది. ఇందులో రెండు వరుసల చుట్టలు ఉంటాయి. రాగి తీగ గుండా విద్యుత్ ప్రవహించినపుడు సీలింగ్ ఫ్యాన్లోని ఇనుప కోర్ తాత్కాలికంగా అయస్కాంతంగా మారుతుంది (విద్యుదయస్కాంతం). మధ్యలో గల తీగ చుట్టల కోయిల్ కు కొద్ది దూరంలో వలయాకార ఇనుప చట్రం దానికి తగల కుండా ఉండును. ఇది బాల్ బేరింగ్స్ సహాయంతో స్వేచ్ఛగా తిరిగేటట్లు ఉంటుంది. ఈ చట్రం నకు చుట్టూ మూడుగాని, నాలుగు గాని రెక్కలు బింగింపబడి ఉంటాయి. వలయంలో విద్యుత్ ప్రవహింపజేసినపుడు మధ్యలో స్థిరంగా ఉన్న యినుప కోర్ కు చుట్టబడిన కోయిల్ అయస్కాంతంగా మారును. అందువల్ల దాని చుట్టూ గల చట్రం ఆకర్షించుటకు చేసె ప్రయత్నంలో దాని చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతుంది.సీలింగ్ ఫ్యాన్కు అందజేయబడిన విద్యుత్ ప్రవాహాన్ని పెంచినా, తగ్గించినా విద్యుదయస్కాంత శక్తిలో మార్పులు సంభవించి వేగంగా లేదా నెమ్మదిగా తిరుగుతుంది. సీలింగ్ ఫ్యాన్ వేగం (1) యినుప కోర్ కు చుట్టబడిన రాగితీగల సంఖ్య (2) విద్యుత్ ప్రవాహం (3) యినుప కోర్ వైశాల్యం పై ఆధారపడుతుంది.

చరిత్ర

[మార్చు]

1860, 1870 ప్రారంభంలో మొదటిసారి సీలింగ్ ఫ్యాన్లు కనిపించాయి. అమెరికాలో డచెస్ మెలిస్సా రినాల్డి రాకీ పర్వతాలలో తాత్కాలికంగా నివాసం ఉన్న సమయంలో ఈ సీలింగ్ ఫ్యాన్ రూపకల్పన చేశారు.

అమరిక

[మార్చు]

సీలింగ్ ఫ్యాన్ లోని మధ్య భాగమున ఒక విద్యుత్ యంత్రము వలన రెక్కలు తిప్పబడుతాయి. ఈ యంత్రానికి కెపాసిటర్ మోటరు అని పేరు. ఈ యంత్రములో ఒక ప్రధాన వైండింగు, ఒక స్టార్టింగు వైండింగు, ఒక కెపాసిటర్ ఉండును. ఈ యంత్రములో ఉండే కెపేసిటర్ పాడయిన, అది విద్యుత్ శక్తిని నిల్వచేసుకునే సామర్థ్యం తగ్గి ఫ్యాన్ తిరుగకపోవుట, మెల్లిగా తిరుగుట, జరుగును. ఈ ఫ్యాన్ వేగము మార్చుటకు ఫ్రస్తుత కాలములో ఎక్కువగా ఎలెక్ట్రానిక్ వేగమార్పిడి పరికరములు (రెగ్యులేటర్లు) వాడబడుచున్నవి.

సీలింగ్ ఫ్యాన్కు ఇతర రకాల ఫ్యాన్లకు తేడాలు

[మార్చు]
  • సీలింగ్ ఫ్యాన్ గదిలో పైకప్పుకు బిగించబడి ఉంటుంది. మన ఇష్టానుసారం అప్పటికప్పుడే జరపడం వీలుండదు. మేజా ఫ్యాన్ (టేబుల్ ఫ్యాను) ఏ సమయంలోనైనా ఎక్కడైనా పెట్టి గాలి పొందవచ్చు
  • సీలింగ్ ఫ్యాన్ గదిలీ పైన బిగించబడి ఉంటుంది కనుక గాలి పైనుంచి వస్తుంది. గాలి గదిలో అందరికీ సమానంగా సరఫరా అవుతుంది. అదే మేజా ఫ్యాన్ అయితే ఒకే ప్రక్క నుంచి, ఒకే ఎత్తు నుంచి వస్తుంది కనుక పై విధంగా జరుగదు.
  • సీలింగ్ ఫ్యాన్ పైన పైకప్పుకు అమర్చబడుతుంది కాబట్టి సాధారనంగా గాలి వెచ్చదనం అధికం. ఆ గదిపై మరో గది లేనప్పుడు వేసవిలో పైకప్పు వేడెక్కి సీలింగ్ ఫ్యాన్ యొక్క గాలి కూడా వేడిగా వస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఈ వేడి ప్రభావం అధికం. మేజా ఫ్యాన్ పై వేడి ప్రభావం తక్కువ.
  • సీలింగ్ ఫ్యాన్ పైన ఉండుట వల్ల ప్రమాదం ఉండదు కాని మేజా ఫ్యాన్ చిన్న పిల్లలకు కూడా అందుబాటుగా ఉండటంవల్ల వారు వేళ్ళు చేతులు అందులో ఉంచి గాయాలబారిన పడే సంఘటనలు జరుగుతుంటాయి.
  • సీలింగ్ ఫ్యాన్ ప్రారంభము లేదా ఆపుచేయుటకు లేదా వేగం మార్పుచేయడానికి రెగ్యులేటర్ గోడకు అమర్చి ఉంటుంది. మేజా ఫ్యాన్కు ఇది ప్రత్యేకంగా వేరుగా కాకుండా అందులోనే అమర్చబడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]