Jump to content

సీహెచ్‌. విఠల్

వికీపీడియా నుండి
(సీహెచ్‌. విఠల్‌ నుండి దారిమార్పు చెందింది)

చింతలగట్టు విఠల్ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమకారుడు, మాజీ ఉద్యోగ సంఘ నాయకుడు. అతను 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

విఠల్‌ తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్‌ జిల్లా, మర్పల్లి మండలం, బిల్కల్‌లో జన్మించాడు. అతను ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.కామ్‌, ఎల్‌ఎల్‌బీ (ఎం.ఫిల్‌) పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

విఠల్‌ జర్నలిస్టుగా, ఎయిడెడ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశాడు. అతను ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2లో ఆడిటర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 24 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి తెలంగాణ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

విఠల్‌ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పాడు. అతను 1996 నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ప్రొఫెసర్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఉద్యమంలో కీలకంగా పని చేశాడు. తెలంగాణ వద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, జేఏసీ సెక్రటరీ జనరల్‌, కో-చైర్మన్‌గా వివిధ హోదాల్లో ప్రపని చేసి ‘తెలంగాణ విఠల్‌’గా గుర్తింపునందుకున్నాడు.

విఠల్‌ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా నియమితుడై, 2014 డిసెంబరు 18 నుండి 2020 డిసెంబరు 17 వరకు పని చేశాడు. సీహెచ్‌.విఠల్‌ 2021 డిసెంబరు 6న ఢిల్లీలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్సాస్ నఖ్వీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi Education (24 March 2018). "టీఎస్పీఎస్సీ చరిత్ర, నిర్మాణం, విధులు". www.sakshieducation.com. Archived from the original on 9 June 2019. Retrieved 21 May 2021.
  2. TV9 Telugu (6 December 2021). "బీజేపీ తీర్థం పుచ్చుకున్న విఠల్‌.. కండువా కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి నఖ్వీ." Archived from the original on 7 December 2021. Retrieved 7 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)