Jump to content

సీ యూ సూన్

వికీపీడియా నుండి
(సీ యూ సూన్‌ నుండి దారిమార్పు చెందింది)
సీ యూ సూన్‌
దర్శకత్వంమహేష్‌ నారాయణన్‌
రచనమహేష్‌ నారాయణన్‌
కథమహేష్‌ నారాయణన్‌
నిర్మాతఫహాద్‌ ఫాజిల్
నజ్రియా నజీమ్
తారాగణంఫహాద్‌ ఫాజిల్
రోషన్ మ్యాథ్యూ
దర్శన రాజేంద్రన్
ఛాయాగ్రహణంసబిన్ ఉలికాందీ
వర్చువల్ సినిమాటోగ్రఫి:
మహేశ్ నారాయణన్
కూర్పుమహేష్‌ నారాయణన్‌
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థ
ఫాహద్ పాజిల్ అండ్ ఫ్రెండ్స్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
1 సెప్టెంబరు 2020 (2020-09-01)
సినిమా నిడివి
98 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

సీ యూ సూన్‌ మలయాళంలో 2020లో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. ఫహాద్‌ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మహేష్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించగా 1 సెప్టెంబర్ 2020న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటీలో విడుదలైంది.[1]

దుబాయ్‌లో బ్యాంక్‌ ఉద్యోగిగా పని చేస్తున్న జిమ్మి కురియన్ (రోషన్ మ్యాథ్యూ) డేటింగ్‌ యాప్‌ ద్వారా దుబాయ్‌లోనే ఉంటున్న అను సెబాస్టియన్ (దర్శనా రాజేంద్రన్)‌ ని ఆన్‌లైన్‌లో ప‌రిచ‌య‌మ‌వుతుంది. తన చిన్నప్పటి ఫోటోలు, కుటుంబం ఫోటోలు అన్నీఅతనితో షేర్‌ చేస్తుంటుంది. జిమ్మి కురియన్, అను సెబాస్టియన్తో ప్రేమలో పడతాడు. అమెరికాలో ఉంటున్న తన తల్లికి వీడియో కాల్‌ ద్వారా ఆమెను పరిచయం చేస్తాడు. పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని చెబుతాడు. ఈ లోపల ఆ అమ్మాయి తాను ఉన్నచోట ఇబ్బంది పడుతున్నానని, తీసుకెళ్లమని అతనికి చెబుతుంది. దాంతో ఆమె ఉంటోన్న ఏరియా నుంచి తన ఫ్లాట్‌కు తీసుకొస్తాడు. వారం తర్వాత ఆ అమ్మాయి అదృశ్యం అవుతుంది. ఈ విషయాన్నీ తన బంధువు, సైబర్ సెక్యూరిటీ ట్రాక్ చేసే కెవిన్ థామస్ (ఫాహద్ ఫాజిల్) కు చెప్పి అతడి సహాయం కోర‌తాడు. ఇంతకూ ఆ అమ్మాయి ఏమైంది? జిమ్మికి సమస్యను కెవిన్ ఎలా ప‌రిష్క‌రించాడు?? అనేది మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఫాహద్ పాజిల్ అండ్ ఫ్రెండ్స్
  • నిర్మాతలు: ఫహాద్‌ ఫాజిల్
    నజ్రియా నజీమ్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్ నారాయణ్
  • సంగీతం: గోపి సుందర్
  • సినిమాటోగ్రఫీ: సబిన్ ఉలికాందీ
    వర్చువల్ సినిమాటోగ్రఫి:
    మహేశ్ నారాయణన్

మూలాలు

[మార్చు]
  1. The News Minute (21 August 2020). "Fahadh Faasil's 'CU Soon', shot during lockdown, to release on OTT" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  2. TV9 Telugu (1 September 2020). "'సీ యూ సూన్' మూవీ రివ్యూ". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)