సుగవాసి పాలకొండ్రాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుగవాసి పాలకొండ్రాయుడు

పదవీ కాలం
1984-1989
నియోజకవర్గం రాజంపేట

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం బాలసుబ్రమణ్యం, ప్రసాద్‌బాబు
మూలం Loksakbhaph.nic.in

సుగవాసి పాలకొండ్ రాయుడు/ సుగవాసి పాలకొండ్రాయుడు (జననం జూలై 3, 1946) ఒక భారత రాజకీయ నాయకుడు.

తొలి జీవితం[మార్చు]

రాయుడు కడప జిల్లాలోని రాయచోటి గ్రామంలో జన్మించాడు. రాయచోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రాయుడు 1968 సంవత్సరంలో డిసెంబర్ 3 న వివాహం చేసుకున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

రాయుడు జనతా పార్టీ అభ్యర్థిగా 1978లో కడప జిల్లాలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.[1] 1983లో రెండవ సారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.[2] తెలుగు దేశం పార్టీ నుండి 1984 లో ఆంధ్రప్రదేశ్ లోని రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు.[3] 1999, 2004 లలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.[4] [5]

మూలాలు[మార్చు]

Profile of Sugavasi Palakond Rayudu at Lok Sabha website

  1. "Andhra Pradesh election results 1978".
  2. "Andhra Pradesh election results 1983".
  3. "Lok Sabha election results 1984".
  4. "Andhra Pradesh election results 1999".
  5. "Andhra Pradesh election results 2004".