సుచిత్రా మిత్ర
Appearance
సుచిత్రా మిత్ర | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | గుజండీ, బిహార్ | 1924 సెప్టెంబరు 19
మరణం | 2011 జనవరి 3 కలకత్తా, పశ్చిమ బెంగాల్ | (వయసు 86)
సంగీత శైలి | గాయని |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1941–2011 |
సుచిత్రా మిత్ర (1924, సెప్టెంబరు 19 - 2011 జనవరి 3) బెంగాలీ సినిమా గాయని, స్వరకర్త. రవీంద్రభారతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, రవీంద్ర సంగీత విభాగానికి అధిపతిగా పనిచేసింది.
జననం
[మార్చు]సుచిత్ర 1924, సెప్టెంబరు 19 బిహార్ లోని గుజండీలో జన్మించింది. మిత్రా తండ్రి సౌరీంద్ర మోహన్ ముఖర్జీ ప్రముఖ సాహిత్యవేత్త. సుచిత్ర కలకత్తా విశ్వవిద్యాలయ పరిధిలోని స్కాటిష్ చర్చి కళాశాలలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలోనూ చదువుకుంది.[1] సంగీతంలో సుచిత్రా మిత్రకు ఉన్న నైపుణ్యాన్ని పంకజ్ ముల్లిక్ గుర్తించి, ఆమెకు రవీంద్ర సంగీతంలో శిక్షణ అందించాడు. సుచిత్ర, ఠాగూర్ పాటలు, కవిత్వం పట్ల తన ప్రేమను పెంచుకుంది.
గుర్తింపులు, గౌరవాలు
[మార్చు]- లండన్ టాగోర్ హైమ్ సొసైటీ నుండి 1945లో టాగోర్ హైమ్ ప్రైజ్.
- భారత ప్రభుత్వం నుండి 1974లో పద్మశ్రీ పురస్కారం
- భారత ప్రభుత్వం నుండి 1986లో సంగీత నాటక అకాడమీ అవార్డు
- హెచ్ఎంవి గోల్డెన్ డిస్క్ అవార్డు,
- ఏషియన్ పెయింట్స్ నుండి శిరోమోని పురస్కారం,
- విశ్వభారతి నుండి దేశికోత్తమ,
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి అల్లావుద్దీన్ పురస్కారం
- సుచిత్రకు 3 గౌరవ డి.లిట్‌లు ప్రదానం చేశారు. రవీంద్రభారతి విశ్వవిద్యాలయం, బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలు పొందారు
- 1984లో రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్‌గా, రవీంద్ర సంగీత విభాగాధిపతిగా పదవీ విరమణ చేసింది.[2]
- సుచిత్ర జీవితంపై డాక్యుమెంటరీ సినిమాలు రూపొందించారు. వాటిలో ఒకటి, రాజా సేన్ రచించిన సుచిత్ర మిత్ర (1993) ఉత్తమ సాంస్కృతిక చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[3]
- కోల్‌కతాలోని ఠాగూర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆమెకు రవీంద్ర-తత్వాచార్య అవార్డును ప్రదానం చేసింది.
- 2001లో కోల్‌కతాకు తొలి మహిళా షెరీఫ్‌గా అవతరించింది.
మరణం
[మార్చు]సుచిత్ర, గుండె సంబంధిత వ్యాధితో 2011, జనవరి 3న కోల్‌కతాలో మరణించింది.
గ్రంథ పట్టిక
[మార్చు]- ఠాగూర్ పాటలు (ఎన్సైక్లోపీడియా). 1984.
- గురేర్ పుటుల్ . ఆనంద పబ్లిషర్స్. 2000ISBN 81-7215-457-7 .
- రతన్పురేర్ రహస్య . ఆనంద పబ్లిషర్స్.ISBN 81-7756-077-8ISBN 81-7756-077-8 .
మూలాలు
[మార్చు]- ↑ "Journalist to be new sheriff". The Times of India. 24 December 2009. Archived from the original on 11 August 2011.
- ↑ "Suchitra Mitra", Stanford University, www.stanford.edu.
- ↑ Raja Sen biography Archived 2 జనవరి 2010 at the Wayback Machine