సుజానే బెర్నెర్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుజానే బెర్నెర్ట్
లవ్ రెసిపీ ఆడియో విడుదలలో సుజానే బెర్నెర్ట్
జననం (1982-09-26) 1982 సెప్టెంబరు 26 (వయసు 41) [1]
డెట్మోల్డ్, జర్మనీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅఖిల్ మిశ్రా (m.2009) (మ. 2023)

సుజానే బెర్నెర్ట్ (ఆంగ్లం: Suzanne Bernert; జననం 1982 సెప్టెంబరు 26), భారతీయ సినిమాకు చెందిన జర్మన్ నటి. ఆమె వివిధ భాషలలో భారతీయ చిత్రాలలో నటిస్తుంది.[2][3][4][5] ఆమె రామధను - ది రెయిన్‌బో (2014), హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి. లిమిటెడ్ (2007) చిత్రాలతో పాటు టెలివిజన్ ధారావాహికలు 7 ఆర్సీఆర్, కసౌతి జిందగీ కే లలో నటించింది.[6][7][8]

ఫ్రెంచ్, ఇటాలియన్, ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, హిందీ, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో ఆమె మాట్లాడుతుంది.[9][10][11][12] ఆమె కలర్స్ టీవి ప్రసారం చేసిన చారిత్రాత్మక ధారావాహిక చక్రవర్తిన్ అశోక సామ్రాట్‌లో క్వీన్ హెలెనా పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.[13][14] ఆమె స్టార్ ప్లస్ సీరియల్ యే రిష్తా క్యా కెహ్లతా హైలో కూడా నటించింది.[15][16] ఆమె టెలివిజన్ సిరీస్ 7 ఆర్సీఆర్, హిందీ చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌ (2019)లో సోనియా గాంధీ పాత్రను పోషించింది.[17][18]

తెలుగులో 2019 సినిమా యాత్రకు కొనసాగింపుగా 2024 ఫిబ్రవరి 8న విడుదలకు సిద్ధమవుతున్న యాత్ర 2లో ఆమె సోనియా గాందీ పాత్రను పోషిస్తోంది.[19]

కెరీర్

[మార్చు]

జర్మనీలోని డెట్‌మోల్డ్‌కు చెందిన మోనికా, మైఖేల్ దంపతులకు సుజానే బెర్నెర్ట్ జన్మించింది. వారి కుటుంబం లిండావులో నివసిస్తుంది. ఆమె 19 సంవత్సరాల వయస్సులో బెర్లిన్‌లో హైడెలోట్ డీహెల్ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల నటన కోర్సు చేసింది. అలాగే, ఆమె శిక్షణ పొందిన బ్యాలెట్ డ్యాన్సర్.

2003లో భారతీయ చిత్రనిర్మాత అనంత్ దుసేజాతో కలిసి డెస్టైన్డ్ హార్ట్స్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది, ఇది పూర్తిగా దుబాయ్‌లో చిత్రీకరించబడింది కానీ విడుదలకు నోచుకోలేదు.[20][21]

2005లో ముంబైకి చేరిన ఆమె. హిందీ, మరాఠీ, బెంగాలీ మాట్లాడగలదు. బెంగాలీ, మరాఠీలతో పాటు పలు టెలివిజన్ ధారావాహికలలో ఆమె నటించడం ప్రారంభించింది. ఆ తరువత, ఆమె బెంగాలీ, మరాఠీ చిత్రాలలోనూ నటించింది.[22][23]

టైటాన్ వాచెస్ యాడ్‌లో ఆమె అమీర్ ఖాన్ సరసన నటించింది.[24] ఆమె పధరో ఇండియా అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించడం ద్వారా జైపూర్ టూరిజంను ప్రోత్సహించింది.[25][26]

2019లో వచ్చిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంలో ఆమె సోనియా గాంధీ పాత్రను పోషించి మెప్పించింది.[27][28] రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018లో ఆమె భారతీయ సినిమా, టెలివిజన్‌లకు అత్యుత్తమ సహకారం అందించింది.[29] 2018 అక్టోబరు 1న అహ్మదాబాద్‌లో జరిగిన గుజరాత్ కామా అవార్డ్స్ లో ఆమె పురస్కారం అందుకుంది.[30] మజ్ను కి జూలియట్ అనే షార్ట్ ఫిల్మ్‌లో ఆమె నటించింది.[31]

2020లో, ఆమె జీ5 కోసం స్టేట్ ఆఫ్ సీజ్ 26/11 అనే తన మొదటి వెబ్ సిరీస్‌లో నటించింది.[32] ఆమె భారతదేశంలోని ముంబైలోని జర్మన్ కాన్సులేట్‌కు ప్రముఖ అతిథిగా ముంబై ఆక్టోబర్‌ఫెస్ట్‌ను ప్రారంభించింది.[33] తన మొదటి షార్ట్ స్టోరీని ది దీపావళి గిఫ్ట్ ఎండ్ ఆఫ్ 21 పేరుతో ప్రచురించింది.[34]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నటుడు అఖిల్ మిశ్రాను 2009 ఫిబ్రవరి 3న సివిల్ కోర్టులో ఆమె వివాహం చేసుకుంది.[35] ఆ తరువాత, వారిద్దరు 2011 సెప్టెంబరు 30న సంప్రదాయ పద్ధతిలో మళ్లీ వివాహం చేసుకుని ఒకటయ్యారు.[36][37][38] ఆమె అతనితో కలిసి క్రమ్ చిత్రం, సీరియల్ మేరా దిల్ దేవానా (దూరదర్శన్)లలో పనిచేసింది.[39] ఆమె వివాహం తర్వాత ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డును పొందింది. అయితే, ఆమె భర్త 2023 సెప్టెంబరు 19న ప్రమాదవశాత్తు వంటగదిలో పడిపోవడంతో మరణించాడు.[40]

సామాజిక సేవ

[మార్చు]

నటుడు గోవిందతో కలసి ఆమె మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నర్మదా సేవా యాత్రలో భాగమయింది.[41]

మూలాలు

[మార్చు]
 1. Mani Mahesh Arora (25 September 2015). "Suzanne Bernert's Birthday Special". The Times of India. Retrieved 15 March 2018.
 2. "Tadka in Marathi Movies". Archived from the original on 6 July 2009. Retrieved 13 September 2016.
 3. "celebrates his Cannes victory".
 4. Dangor, Kimi (9 October 2006). "German actor Suzanne Bernert to make Bollywood debut in Honeymoon Travels Pvt Ltd". India Today. Retrieved 25 January 2021.
 5. "Suzanne Bernert's Birthday Special". The Times of India (in ఇంగ్లీష్). 25 September 2015. Retrieved 25 January 2021.
 6. "Suzanne Bernert bags a film". The Times of India. 16 September 2013. Retrieved 22 February 2014.
 7. "rediff.com: Meet the only gori bahu on TV!". Rediff.com.
 8. "Suzanne Bernert approached to enter Bigg Boss - The Times of India". The Times of India. 20 November 2012.
 9. "Suzanne Bernert in Shaitan!!!". The Times of India. 12 March 2013. Retrieved 22 February 2014.
 10. "I thought industrywallahs were ego-centric: Suzanne – The Times of India". The Times of India. 10 October 2009. Retrieved 17 April 2016.
 11. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 1 March 2014. Retrieved 24 February 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 12. "Suzanne Bernert's Birthday Special". The Times of India. 25 September 2015.
 13. "I am leaving 'Chakravartin Ashoka Samraat' with a heavy heart, says Queen Helena aka Suzanne Bernert". The Times of India. 28 July 2016. Retrieved 13 September 2016.
 14. "Suzanne Bernert and Sumit Kaul revel in their fashion glory". The Times of India. 10 April 2015. Retrieved 13 September 2016.
 15. "Yeh Rishta Kya Kehlata Hai is a big leap for me, says Suzanne Bernert - The Times of India". The Times of India. 30 June 2016.
 16. "Yeh Rishta Kya Kehlata Hai's Akshara aka Hina Khan is very professional: Suzanne Bernett - The Times of India". The Times of India. 23 September 2016.
 17. InpaperMagazine, From (9 February 2014). "Playing Sonia Gandhi". Dawn. Pakistan. Retrieved 17 April 2016.
 18. Giridhar Jha (17 January 2019). "I've Been Sonia Before, Had To Do This: Suzanne Bernert". Outlook. Retrieved 12 February 2019.
 19. "'యాత్ర 2'.. సోనియా పాత్రలో కనిపించనున్న నటి ఎవరో తెలుసా..? | Do You Know Who Played Sonia Gandhi Role In Yatra 2 Movie, Know Interesting Things About Her - Sakshi". web.archive.org. 2023-11-07. Archived from the original on 2023-11-07. Retrieved 2023-11-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 20. German lady finds Indian link through telly Archived 13 మార్చి 2014 at the Wayback Machine
 21. After Hrs Correspondent (17 September 2006). "It's homecoming for Suzanne". DNA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 17 April 2016.
 22. "Suzanne Bernert bags Kalay Tasmay Namah". The Times of India. 25 September 2012. Retrieved 17 April 2016.
 23. "German actor does the lavani". mid-day. 7 May 2009. Archived from the original on 15 September 2014. Retrieved 17 April 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 24. "German actress confess- to be successful in Bollywood you need Khan's to pull you along!". topnews.in. Retrieved 17 April 2016.
 25. "German actress shoots a film on Indian tourism". 4 December 2012. Archived from the original on 27 February 2014. Retrieved 24 February 2014.
 26. "German actress to woo tourists in Rajasthan". dailybhaskar. 28 November 2012. Retrieved 17 April 2016.
 27. "The Accidental Prime Minister: German actor Suzanne Bernert to play Sonia Gandhi in Anupam Kher starrer". 6 April 2018.
 28. Taran Adarsh [@taran_adarsh] (27 December 2018). "Trailer out today... New poster of #TheAccidentalPrimeMinister... Stars Anupam Kher and Akshaye Khanna... Directed by Vijay Ratnakar Gutte... 11 Jan 2019 release... #TAPM #TAPMTrailer t.co/VR4nHPNrhT" (Tweet) – via Twitter.
 29. Bernd Buchfeld (30 January 2018). "Auszeichnung – Westallgäuerin bekommt Filmpreis in Indien". all-in.de (in జర్మన్). Retrieved 8 April 2018.
 30. Bernd Buchfeld (9 October 2018). "Filmpreis: Westallgäuer Schauspielerin steht in Bollywood im Rampenlicht". all-in.de (in జర్మన్). Retrieved 9 October 2018.
 31. Ghosh, Sankha (4 June 2019). "'Majnu ki Juliet', a sweet story of a rikshawalla, a young man and a dupatta - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 September 2019.
 32. "ZEE5's State of Siege: 26/11 unravels the Untold Stories during the unfortunate 26/11 terror attacks". News18. 20 March 2020. Retrieved 23 March 2020.
 33. Bernd Buchfeld. "Allgäuer Schauspielerin eröffnet Oktoberfest in Mumbai". all-in.de (in జర్మన్). Archived from the original on 20 October 2019. Retrieved 13 October 2019.
 34. "Not enough roles for foreign actors here". 10 November 2021.[permanent dead link]
 35. Kushali Nag (10 October 2009). "The German bahu". The Telegraph. Archived from the original on 28 February 2014. Retrieved 14 March 2018.
 36. Zinia Sen (28 May 2011). "Suzanne-Akhil to tie the knot again!". The Times of India. Retrieved 17 April 2016.
 37. Zinia Sen (27 May 2011). "Actor Suzanne Bernert is all set to have a traditional wedding ceremony on September 30. Suzanne, who's already married to Akhil Mishra (the librarian in "3 Idiots"), will be going for the pheres on the insistence of her father, who'll be coming down from Germany to attend the ceremony". The Times of India. Retrieved 17 April 2016.
 38. Zinia Sen (7 July 2012). "Is success related to failed marriage?". The Times of India. Retrieved 17 April 2016.
 39. "Actress forgoes chance to star alongside Richard Gere for local commitment". The Times of India. 11 December 2013. Retrieved 22 February 2014.
 40. Farzeen, Sana (21 September 2023). "3 Idiots actor Akhil Mishra dies at 58 after fall in the kitchen". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 21 September 2023.
 41. "Govinda spends time with fans at Bhopal station".