Jump to content

సుధారాణి రఘుపతి

వికీపీడియా నుండి
సుధారాణి రఘుపతి
వ్యక్తిగత సమాచారం
జననం(1944-03-21)1944 మార్చి 21
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం నృత్యకారిణి

సుధారాణి రఘుపతి ఒక భరతనాట్య కళాకారిణి.

విశేషాలు

[మార్చు]

ఈమె 1944, మార్చి 21వ తేదీన జన్మించింది. ఈమె మైసూరు విశ్వవిద్యాలం నుండి సోషియాలజీ, ఫిలాసఫీలలో బి.ఎ.డిగ్రీ సంపాదించింది. ఈమె భరతనాట్యాన్ని కె.పి.కిట్టప్ప పిళ్ళై, యు.ఎస్.కృష్ణారావు, మైలాపూర్ గౌరి అమ్మ వద్ద నేర్చుకుంది. ఈమె కర్ణాటక సంగీతాన్ని వాయులీన విద్వాంసుడు తిరుమకూడలు చౌడయ్య, వాగ్గేయకారుడు మదురై ఎన్.కృష్ణన్‌ల వద్ద నేర్చుకుంది.[1][2]

ఈమె 1964-65లో వర్జీనియాలోని రాండాల్ప్ మేకన్స్ మహిళా కళాశాలలో చదివింది. ఈ కళాశాలలో చదివిన మొట్టమొదటి భారతీయురాలు ఈమె. ఇక్కడ ఈమె వరల్డ్ హిస్టరీ ఆఫ్ డాన్స్, స్టూడియో ఆర్ట్స్, మాడర్న్ డాన్సులో మార్థా గ్రాహం టెక్నిక్ మొదలైనవి నేర్చుకుంది. ఈమె పాశ్చాత్య సంగీతం కూడా నేర్చుకుంది.

ఈమె 1981లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, న్యూయార్క్‌లో తన నాట్యప్రదర్శన గావించింది. ఇంకా ఈమె తన నాట్యకౌశలాన్ని నికిటా కృశ్చేవ్, ఇథియోపియా మహారాజు, ఇరాన్ షా, ఆఫ్ఘనిస్తాన్ రాజు, చౌ ఎన్ లై, హో చి మిన్, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలైన వారి ముందు ప్రదర్శించింది.

ఈమె దూరదర్శన్‌లో భరతనాట్యం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ "భరతాంజలి" అనే టెలీ సీరియల్‌ను నిర్మించింది. ఈ సీరియల్ 1981లో 13 వారాలు తెలుపు నలుపులో, 1989లో 8 వారాలు రంగుల్లో ప్రసారం అయ్యింది.

ఈమె అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని భరతనాట్య సంబంధమైన పత్ర సమర్పణలు చేసింది. ఈమె న్యూఢిల్లీ లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్‌కు 1998-2002 కాలంలో ఉపాధ్యక్షురాలిగా సేవలను అందించింది. 1995లో న్యూయార్క్‌లోని కోల్గేట్ యూనివర్శిటీలో సీనియర్ టీచింగ్ అసోసియేట్ (ప్రొఫెసర్) గా నియమించబడింది.

1970లో ఈమె శ్రీ భరతాలయ అనే సంస్థను స్థాపించి అనేక మంది శిష్యులకు శిక్షణను ఇచ్చింది. ఈ సంస్థ ద్వారా మధుర మార్గం (మదురై ఎన్.కృష్ణన్ కృతుల సంకలనం), లఘు భారతం (మూడు భాగాలు), 12 ఆడియో కేసెట్లను విడుదల చేసింది. ఈమె ఇటీవల మధుర మార్గం, నవసంధి కవిత్వం, మధుర తిల్లానాలకు దర్శకత్వం వహించి సిడి, డివిడిల రూపంలో విడుదల చేసింది. ఈమె శ్రీవిల్లిపుతూరు ఆలయ సేవలపై ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. 1981లో సంగీత నాటక అకాడమీ ఈమె నవసంధి నృత్యాన్ని రికార్డు చేసింది.

ఈమె రామాయణం, కృష్ణం వందే జగద్గురుం, శక్తి ప్రభావం, వందే గుహం ఉమాసుతం, ఏకమేవ న ద్వయం, శంకర లోకశంకర, శిలప్పదికారం మొదలైన నృత్యనాటికలకు నృత్య దర్శకత్వం వహించింది.

పురస్కారాలు, గౌరవాలు

[మార్చు]

ఈమెకు అనేక పురస్కారాలు, గౌరవాలు లభించాయి. వాటిలో కొన్ని:

మూలాలు

[మార్చు]