సుధీర్ తైలంగ్
సుధీర్ తైలంగ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | బికనీర్, రాజస్థాన్, భారత దేశం | 1960 ఫిబ్రవరి 26
మరణం | 2016 ఫిబ్రవరి 6 | (వయసు 55)
వృత్తి | కార్టూనిస్టు |
జాతీయత | భారతీయుడు |
పురస్కారాలు | పద్మశ్రీ(2004) |
జీవిత భాగస్వామి | విభా తైలంగ్ |
సంతానం | అదితి తైలంగ్ |
సుధీర్ తైలంగ్ (1960 ఫిబ్రవరి 26 – 2016 ఫిబ్రవరి 6) సుప్రసిద్ధ భారతీయ కార్టూనిస్టు.
జీవిత విశేషాలు
[మార్చు]రాజస్థాన్ లోని బీకానేర్‌లో ఫిబ్రవరి 26 1960 న జన్మించారు.[1] ఆయన పాత్రికేయ జీవితం 1982లో ముంబయి నుంచి వెలువడిన 'ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా'లో మొదలైంది. 1970లోనే ఆయన తన తొలి కార్టూన్ గీశారు. 1983లో ఆయన 'నవభారత్ టైమ్స్'లో పని చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆంగ్ల దినపత్రిక 'హిందుస్తాన్ టైమ్స్'లో పనిచేశారు. ఇంకా, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్', 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వంటి దినపత్రికల్లో కూడా ఆయన కార్టూన్లు వేశారు.[2] తైలంగ్ పూర్వీకులు తెలంగాణకు చెందినవారని, తెలంగాణగా ఉన్న పేరు తైలంగ్‌గా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజస్తాన్‌లోని బికనూర్‌లో పుట్టిన సుధీర్ తైలంగ్ ప్రముఖ రాజకీయ నేతలపై కార్టూన్లు వేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
2004లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది[3]. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై వేసిన కార్టూన్లన్నింటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకం పేరు 'నో, ప్రైమ్ మినిస్టర్'[4].
మరణం
[మార్చు]బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఇప్పటికే రెండుసార్లు సర్జరీ చేసుకున్న ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ సుధీర్ తైలంగ్ (56) గుర్గావ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6 2016 న మరణించారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Cartoonist Sudhir Tailang Dies At 55". Indo-Asian News Service. 6 February 2016. Retrieved 6 February 2016.
- ↑ "కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ కన్నుమూత". Archived from the original on 2016-02-07. Retrieved 2016-02-07.
- ↑ Padma Shri Awardees of 2004
- ↑ No Prime Minister Launched[permanent dead link]
- ↑ "ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ కన్నుమూత". సాక్షి. 7 February 2016. Retrieved 7 February 2016.