సునీతా విలియమ్స్
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సునీతా విలియమ్స్ | |
---|---|
![]() | |
జననం | యూక్లిడ్, ఓహియో, యు.ఎస్ | 1965 సెప్టెంబరు 19
స్థితి | క్రియాశీలకం |
వృత్తి | టెస్ట్ పైలట్ |
అంతరిక్ష జీవితం | |
నాసా వ్యోమగామి | |
ర్యాంకు | ![]() |
అంతరిక్షంలో గడిపిన కాలం | 608 రోజుల 20 నిమిషాలు |
ఎంపిక | నాసా వ్యోమగామి వర్గం 17 |
మొత్తం ఇ.వి.ఎ.లు | 7 |
మొత్తం ఇ.వి.ఎ సమయం | 62 గంటల 6 నిమిషాలు |
అంతరిక్ష నౌకలు | STS-116/117 (Expedition 14/15), Soyuz TMA-05M (Expedition 32/33), CTS-1 |
అంతరిక్ష నౌకల చిత్రాలు | ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా (NASA) వ్యోమగామి. అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను నిర్వహించిన సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేసింది ఆ తర్వాత, ఆమె సాహసయాత్ర 15లో చేరింది. 1983లో విలియమ్స్ మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లోని యు.ఎస్. నావల్ అకాడమీలో ప్రవేశించింది. ఆమె 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తరువాత జూలై 1989లో ఆమె యుద్ధ హెలికాఫ్టర్ శిక్షణను పూర్తిచేసింది.[1] పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహాక కార్యక్రమాలలో, ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్‌ల స్థాపనలో, అలాగే 1992లో మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నది.
ఆమె, మరో నాసా వ్యోమగామి బారీ విల్మోర్ తో కలిసి అంతరిక్ష కేంద్రంలోకి[2] 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్‌లో భాగంగా ఈ రోదసీ యాత్రను చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా, స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. మళ్ళీ మరోసారి వాయిదా పడింది. చివరికి సెప్టెంబరు 7న సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. వారు 9 నెలల నిరీక్షణ తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2025 మార్చి 19న సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.[3]
జనవరి 2025 నాటికి, సునీతా విలియమ్స్ మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు తొమ్మిది స్పేస్‌వాక్స్ చే'సింది, దీంతో ఆమె మహిళల్లో నంబర్ వన్ స్థానంలో, అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్‌వాకర్ల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది.[4]
జీవిత విశేషాలు
[మార్చు]సునీత అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్య భారతదేశం గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు. వీరికి ఉన్న ముగ్గురు సంతానంలో సునీత చివరిది. ఆమె అమెరికాలోని నవల్ అకాడెమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేసింది.[5]
వ్యోమగామి
[మార్చు]తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా చేరింది. నేవల్ ఏవియేటర్ గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లపై 2770 విమాన ( ఫ్లైట్ అవర్స్) గంటల అనుభవం గడించింది..
నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానం లో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తరువాత అంతరిక్షం లోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె. తొలి పర్యటన డిసెంబరు 2006 నుండి జూన్ 2007 వరకు జరిగింది. రెండోసారి 2012లో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో గడిపింది. అంతరిక్షం లో గడిపిన 322 రోజులలో ఒక రోజు కూడా వ్యాయామం మానలేదు.
అంతరిక్ష మొదటి ప్రయాణం లో ఆరు నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మత్తులు చేయడం వంటివి చేసింది. రెండవ సారి ఆర్బిటింగ్ ప్రయోగశాల పై పరిశోధనలు జరిపింది.
సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ అవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే "నాసా ఎక్సట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్" బృందం తో కలిసి పని చేసింది.[5]
అంతరిక్ష కేంద్రంలో సాహసయాత్ర
[మార్చు](2024 జూన్ 5 - 2025 మార్చి 18)
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో చేరుకున్నారు. దానిలో తలెత్తిన సమస్యల కారణంగా తొమ్మిది నెలల బసగా మారింది. వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా, స్పేస్‌ఎక్స్ సహకారంతో 2025 మార్చి 15న క్రూ-10 మిషన్‌ను ప్రారంభించింది. వారు 286 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత 2025 మార్చి 18న భూమికి తిరిగి క్షెమంగా వచ్చారు.
ప్రారంభ మిషన్:
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఉన్నారు, ప్రారంభంలో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఎనిమిది రోజుల టెస్ట్ ఫ్లైట్‌గా ప్రణాళిక చేయబడింది.
స్టార్‌లైనర్ సమస్యలు:
స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్యలు ఏర్పడడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో వారి బసను నిరవధికంగా పొడిగించవలసి వచ్చింది.
భూమికి తిరిగి రావడం:
స్టార్‌లైనర్‌కు బదులుగా స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లో వారిని తిరిగి భూమికి తీసుకురావాలని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) నిర్ణయించింది.
తిరిగి వచ్చే తేదీ:
వారు 286 రోజులు అంతరిక్షంలో గడిపిన తర్వాత 2025 మార్చి 18న భూమికి తిరిగి వచ్చారు.
మిషన్ కార్యకలాపాలు:
ఈ కాలంలో వారు శాస్త్రీయ పరిశోధన, నిర్వహణ కార్యకలాపాలు, సాంకేతిక ప్రదర్శనలకు దోహదపడ్డారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఆహారం:
వారికి పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యల కాక్‌టెయిల్స్ వంటి ప్రీ-ప్యాకేజ్డ్ కంఫర్ట్ ఫుడ్స్, ఫ్రీజ్-డ్రైడ్ పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయి.
శారీరక సవాళ్లు:
నెలల తరబడి అంతరిక్షంలో నివసించడం వల్ల కండరాలు, ఎముకల సమస్యలు, దృష్టి సమస్యలు వంటి శారీరక సవాళ్లు ఎదురవుతాయి.
మిషన్ తర్వాత పునరావాసం:
తిరిగి వచ్చిన వారిని, అంతరిక్ష ప్రయాణాల భౌతిక ప్రభావాల నుండి కోలుకోవడానికి నాసా 45-రోజుల మిషన్ తర్వాత పునరావాస కార్యక్రమానికి తరలిస్తారు.
గుర్తింపు
[మార్చు]- 2008లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
- బోస్టన్ మారథాన్ లో పాల్గొన్న మొదటి వ్యక్తి..[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sunita Williams | Biography, Achievements, & Facts". Encyclopedia Britannica. Retrieved 2020-06-15.
- ↑ "sunita williams: సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం వచ్చే ఏడాదే.. | sunita-williams-and-barry-wilmore-will-come-to-earth-from-next-year-february". web.archive.org. 2024-09-14. Archived from the original on 2024-09-14. Retrieved 2024-09-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sunita Williams: క్షేమంగా తిరిగొచ్చిన సునీతా.. గుజరాత్‌లో సంబురాలు | celebrations-erupt-in-gujarat-village-as-nasa-sunita-williams-returns-to-earth". web.archive.org. 2025-03-19. Archived from the original on 2025-03-19. Retrieved 2025-03-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sunita Williams - EVA experience". spacefacts.de. Retrieved 2025-01-30.
- ↑ 5.0 5.1 5.2 నీలాల నింగిలోకి మూడోసారి. ఈనాడు.18 May 2024