సునీల్ కుమార్ సోని
సునీల్ కుమార్ సోని | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | బ్రిజ్‌మోహన్ అగర్వాల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాయ్‌పూర్ సిటీ సౌత్ | ||
పదవీ కాలం 2019 మే 23 – 2024 జూన్ 4 | |||
ముందు | రమేష్ బైస్ | ||
తరువాత | బ్రిజ్‌మోహన్ అగర్వాల్ | ||
నియోజకవర్గం | రాయ్‌పూర్ | ||
రాయ్‌పూర్ మేయర్
| |||
పదవీ కాలం 2004 జనవరి 5 – 2010 జనవరి 5 | |||
ముందు | తరుణ్ ప్రసాద్ ఛటర్జీ | ||
తరువాత | డాక్టర్ కిరణ్మయి నాయక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రాయ్‌పూర్ , మధ్యప్రదేశ్ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ ), భారతదేశం | 1961 నవంబరు 28||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | కన్వర్ లాల్ జీ సోనీ, రుక్మణి దేవి | ||
జీవిత భాగస్వామి | తారా దేవి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
సునీల్ కుమార్ సోని (జననం 28 నవంబర్ 1961) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2024లో రాయ్‌పూర్ సిటీ సౌత్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సునీల్ కుమార్ సోని భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2000లో రాయ్‌పూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై 2000 నుండి 2003 వరకు ఛైర్మన్‌గా, 2003, 2008 రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికై 2004 జనవరి 5 నుండి 2010 జనవరి 5 వరకు మేయర్‌గా పని చేశాడు. ఆయన 2011 నుండి 2013 వరకు రాయ్‌పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్యుడిగా పని చేశాడు.
సునీల్ కుమార్ సోని 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌పూర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ దూబేపై ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[3] పార్లమెంట్‌లో హౌసింగ్ & పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుల జీతాలు & అలవెన్సులపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
సునీల్ కుమార్ సోని రాయ్‌పూర్ సిటీ సౌత్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సుధాకర్ సింగ్ రాయ్‌పూర్ సిటీ సౌత్ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి 2024లో నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆకాష్ శర్మపై 46167 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] సునీల్ కుమార్ సోని 89220 ఓట్లు సాధించగా, ఆకాష్ శర్మ 43053 ఓట్లు సాధించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (23 November 2024). "Sunil Kumar Soni" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Hindustantimes (23 November 2024). "Chhattisgarh: BJP retains Raipur City South assembly seat". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ The Indian Express (23 November 2024). "Ninth time unlucky – Congress fails to breach BJP fortress in Raipur" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Raipur City South Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.