సుమతి (సినిమా)
స్వరూపం
(సుమతి నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం 1942లో విడుదలైన సినిమా గురించి. పురాణాలలో పతివ్రత కొరకు, సుమతి చూడండి.
సుమతి (1942 తెలుగు సినిమా) | |
నిర్మాణం | కడారు నాగభూషణం |
---|---|
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ, బళ్ళారి లలిత, రామకృష్ణశాస్త్రి, ఆరణి సత్యనారాయణ, కొమ్మూరి పద్మావతీదేవి |
సంగీతం | హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, ఎన్.బి.దినకర్‌రావు |
నేపథ్య గానం | చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ |
గీతరచన | దైతా గోపాలం, సముద్రాల రాఘవాచార్య, తాపీ ధర్మారావు |
సంభాషణలు | మొక్కపాటి నరసింహ శాస్త్రి |
ఛాయాగ్రహణం | కమల్ ఘోష్ |
నిర్మాణ సంస్థ | శ్రీరాజరాజేశ్వరి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ పౌరాణిక చిత్రం 1942, అక్టోబర్ 19వ తేదీ విజయదశమి నాడు 11 కేంద్రాలలో విడుదల అయ్యింది[1]. సతీత్వధర్మాన్ని మరచిపోయి, హైందవస్త్రీ సంప్రదాయానికి కళంకం తెస్తున్న యీనాటి (1942 నాటి) మగువలకు సరియైన మార్గాన్ని చూపి సంసార రంగంలో ఆశాజ్యోతిని వెలిగించే సముజ్వల చిత్రంగా దీనిని పేర్కొన్నారు. ఎన్నడూ సూర్యరశ్మిని ఎరుగని కాంత, ఎవరినీ చెయ్యి చాచి ఎరుగని మగువ కుష్టురోగి, మూర్ఖుడు అయిన తన భర్తపైని ప్రేమానుబంధం, సేవాతత్పరత కారణంగా వేడినిప్పులు కక్కుతున్న ఎండలో ప్రతి గుమ్మం ఎక్కి దిగుతుంది. ఈ పతివ్రత సుమతి పాత్రలో కన్నాంబ ప్రేక్షకుల ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.
నటీనటులు
[మార్చు]- కన్నాంబ - సుమతి
- సి.ఎస్.ఆర్. - కౌశికుడు
- బళ్ళారి లలిత - మోహిని
- త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి -దేవదత్తుడు
- కాకినాడ రాజరత్నం - పార్వతి
- ఆరణి సత్యనారాయణ - శంకరభట్టు
- కొమ్మూరి పద్మావతీదేవి -గౌరమ్మ
- కె.వి.సుబ్బారావు - అవధానులు
- సి.హెచ్.వెంకటచలం - శివుడు
- జె.శేషగిరిరావు - జయరాముడు
- టి.ఆర్.శేషన్ - నారాయణశర్మ
- మొక్కపాటి నరసింహశాస్త్రి - మహేంద్రదీక్షితులు
- ఎం.వి.సూర్యనారాయణ - బ్రహ్మన్న సోమయాజులు
- కె.లలిత - ధర్మదేవత
- కె.గంగారత్నం - నాయకురాలు
- రేణుక - కమల
- అంజనీబాయి - నాట్యకత్తె
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం : కడారు నాగభూషణం
- సంగీతం : హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి,ఎన్.బి.దినకర్‌రావు
- సంభాషణలు : మొక్కపాటి నరసింహ శాస్త్రి
- గీత రచన: దైతా గోపాలం, సముద్రాల రాఘవాచార్య, తాపీ ధర్మారావు
- ఛాయాగ్రహణం : కమల్ ఘోష్
- గాయినీ గాయకులు: సి.ఎస్.ఆర్, కన్నాంబ, బళ్ళారి లలిత, టి.రామకృష్ణశాస్త్రి
పాటలు, పద్యాలు
[మార్చు]ఈ సినిమాలో ఈ క్రింది పాటలు, పద్యాలు ఉన్నాయి[2].
- నా మానసంబునను ఆనందమౌ మధుర వార్తన్ వింటిని - బళ్ళారి లలిత
- నిన్న సాయంత్రమున మిన్నేటి ఛాయలలో - బళ్ళారి లలిత
- పాహిపాహి పరిపాలిత భువనా పాహి దురిత - బళ్ళారి లలిత
- మారుని ఆశల్ తీరగావలెనా ధారుణి - టి. రామకృష్ణ శాస్త్రి, బళ్ళారి లలిత
- అనవరతంబు నిష్ఠమెయి నాత్మ విభున్ భజియింతు నేని ( పద్యం ) - కన్నాంబ
- అప్పుడు డాయ వచ్చె నరుణాబ్జకళాధరు గౌరి భక్తితో ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- ఇంత పాతకినా నాధా ఇంత నిరాదరమా నాపై - పి. కన్నాంబ
- కంకణ కింకిణుల్ మెరయగా మొలనూలు చలింప ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
- కలిగెగా ఈ వేళా గౌరికి దయ కలిగెగా ఘన యశంబు - కన్నాంబ
- జయహే త్రిశూలదారి జయగౌరి - కన్నాంబ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- జాలమేల నే శ్యామలాంబరో సరగుణ నాథగు జాలి - పి. కన్నాంబ
- జీవమే మోహినీ రాగమౌ ప్రణయాను రాగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- తరుణీ నన్ కరుణ గనుమా మరుని బారికి గురి చేయకుమా - టి. రామకృష్ణ శాస్త్రి
- ధ్యాయేత్ సూర్యమనంత శక్తి కిరణం తేజోమయం - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- పతిచరణమే సేవింతున్ భవమును బాసి సుఖింతున్ ( పద్యం ) - పి. కన్నాంబ
- పల్లవ పుష్ప భంగములు పాదసరోరుహ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- ప్రియు నెమ్మేన సగమ్ము నీవ ప్రణయ శ్రీధామమౌ ( పద్యం ) - పి. కన్నాంబ
- శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయి ( శ్లోకం ) - టి. రామకృష్ణ శాస్త్రి
- శమనారాతి నివృత్త ధైర్యుడగుచున్ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- సరిలేని మగని బడయుము తరుణీయని పల్కె ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- స్వామీ నేనీదానరా చలమేలా నీ సరసానుజేరగ - బళ్ళారి లలిత
మూలాలు
[మార్చు]- ↑ భీశెట్టి (15 February 1991). వీరాజీ (ed.). "అలనాటి మేటి చిత్రాలు - సుమతి" (వార పత్రిక). ఆంధ్ర్ర సచిత్రవారపత్రిక. 83 (25). విజయవాడ: శివలెంక నాగేశ్వరరావు: 34. Retrieved 11 October 2016.[permanent dead link]
- ↑ "సుమతి - 1942". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 11 October 2016.[permanent dead link]