త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి
జననం
త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి

ఏప్రిల్ 10, 1914
మరణంమే 21, 1998
వృత్తిరంగస్థల, సినిమా నటుడు, గాయకుడు
తల్లిదండ్రులురాఘవయ్య, కామేశ్వరమ్మ

త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి (ఏప్రిల్ 10, 1914 - మే 21, 1998) రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920, 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన తెనాలి శ్రీరామ విలాస సభలో దర్శకుడిగా పనిచేశాడు.[1]

జననం

[మార్చు]

రామకృష్ణ శాస్త్రి 1914, ఏప్రిల్ 10వ తేదిన రాఘవయ్య, కామేశ్వరమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని పెదరావూరు గ్రామంలో జన్మించాడు.

నాటకరంగం

[మార్చు]

వంశ పారంపర్యముగా వచ్చిన 'తరంగ గానం'ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు.[2] ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి 'రోషనార'లో శివాజీ, 'కృష్ణలీలలు' లో యశోద, 'రామదాసు' లో రామదాసు పాత్రలు పోషించాడు. పువ్వుల సూరిబాబు, కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.

నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో స్థానం నరసింహారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు లతో కలసి ఊరురా తిరిగి 'తులాభారం' నాటకంలో నారదుడుగా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు 'రామాంజనేయ యుద్ధం నాటకంలో నారదుని పాత్రలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఇతర నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలో బిల్వమంగలుడు, శివయోగి, రామదాసు, కబీరు, నారదుడు పాత్రలలో నటించాడు.[3]

సినిమారంగం

[మార్చు]

నారదుడిగా రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు చిత్రపు నరసింహారావు 1937లో తాన దర్శకత్వం వహించిన 'మోహిని రుక్మాంగద' సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు. అలా దాదాపు 12 సినిమాలలో నటించాడు.[4]

నటించిన చిత్రాలు

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]
  1. 1952లో న్యూఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో స్థానం నరసింహరావు ప్రదర్శించిన 'శ్రీకృష్ణ తులాభారం' నాటకంలో నారద పాత్ర పోషించాడు.

మరణం

[మార్చు]

రామకృష్ణ శాస్త్రి తన 84 ఏళ్ళ వయసులో 1998, మే 21న తెనాలిలోని తన అల్లుడి నివాసంలో మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14
  2. Tripuraribhatla Ramakrishna Sastry, Nata Ratnalu, Dr. Mikkilineni Radhakrishna Murthy, Second edition, Sitaratnam Granthamala, Vijayawada, 2002, pp. 115-17.
  3. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.511.
  4. Apara Naradudu Tripuraribhatla Ramakrishna Sastry, Tholinati Gramophone Gayakulu, Modali Nagabhushana Sharma, Creative Links Publications, Hyderabad, 2010, pp. 18-9.
  5. Tripuraribhatla Ramakrishna Sastry, Luminaries of 20th Century, Part II, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp. 514-5.

బయటి లింకులు

[మార్చు]