రోషనార (నాటకం)
స్వరూపం
రోషనార | |
కృతికర్త: | కొప్పరపు సుబ్బారావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | శ్రీ సత్యానంద ప్రెస్, రాజమహేంద్రవరం |
విడుదల: | 1936 |
పేజీలు: | 106 |
రోషనార 1921లో కొప్పరపు సుబ్బారావు రచించిన చారిత్రక దేశభక్తి నాటకం.[1] మహరాష్ట్రవీరుల శౌర్యపరాక్రమాలను, దేశభక్తిని ప్రబోధించిన ఈ నాటకాన్ని, హిందూముస్లిం ఐకమత్యానికి భంగం కలిగిస్తుందనే నెపంతో ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది.[2]
కథానేపథ్యం
[మార్చు]మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సోదరి రోషనారా శివాజీని ప్రేమిస్తుంది. శివాజీచే తిరస్కరించబడిన రోషనార ఆ ప్రేమను ద్వేషంగా మార్చుకొని శివాజీతో యుద్ధంచేసి మరణిస్తుంది.[3]
పాత్రలు
[మార్చు]- శివాజీ (కథానాయకుడు)
- రోషనార (కథానాయకి)
- మోరోపంతు (శివాజీ ముఖ్యమంత్రి)
- రామోజీ
- తానాజీ
- నేతాజీ
- గంగాధరుడు
- మోఅజీము (ఔరంగజేబు కొడుకు)
- రామసింహుడు
- జయసింహుడు
- విక్రమసింహుడు
- మీర్ జుమ్లా
- దావూద్
- ద్వారాపాలకులు
- సైనికులు
- సేవకులు
- దిల్ కుష్
- హుషారీ
ఇతర వివరాలు
[మార్చు]- ఇందులోని హాస్యపాత్రలు రజాక్, దావూర్ కలకాలము నిలిచిపోయే పాత్రలు.
- శివాజీగా మాధవపెద్ది వెంకటరామయ్య, రామసింహునిగా పిల్లలమర్రి సుందరరామయ్య, రోషనారగా స్థానం నరసింహారావు విరివిగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు.[4]
- రామ విలాస సభ ఈ నాటకాన్ని జహ్వారిబాయి పేరుతో ప్రదర్శించినా కూడా బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది.
- 1959లో మద్రాసు నగరంలోని పచ్చియప్ప కళాశాలలో జరిగిన ప్రదర్శనలో ధూళిపాళ సీతారామశాస్త్రి రామసింహుడుగా నటించగా, ఎ. వి. సుబ్బారావు శివాజీ పాత్ర పోషించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నవతెలంగాణ, దీపిక-స్టోరి (1 July 2015). "ఆంధ్రనాటక పితామహుడు ఎవరు?". NavaTelangana. Archived from the original on 21 అక్టోబరు 2018. Retrieved 3 November 2019.
- ↑ తెలుగు నాటక సంక్షిప్త చరిత్ర, రంగస్థల శాస్త్రము-ప్రథమ భాగము, తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1970, పేజీ. 126
- ↑ దేశభక్తిని ప్రబోధించిన రోషనార, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 30 ఏప్రిల్ 2018, పుట.2
- ↑ సాక్షి, ఫన్ డే (1 July 2018). "నటస్థానం". Sakshi. డా. గోపరాజు నారాయణరావు. Archived from the original on 3 నవంబరు 2019. Retrieved 3 November 2019.