మాధవపెద్ది వెంకటరామయ్య
Appearance
మాధవపెద్ది వెంకటరామయ్య రంగస్థల, సినిమా నటుడు.
జీవిత విశేషాలు
[మార్చు]గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఈయన నాటకరంగంలో అద్భుత నటుడిగా పేరు పొందారు. ముఖ్యంగా దుర్యోధనుడు పాత్రలలో, గుమ్మడి, ముక్కామల కృష్ణమూర్తి, ధూళిపాళ లాంటివారికి ఈయన గురుతుల్యులు. వెంకటరామయ్యను ఆంధ్ర పృధ్వీరాజ్ అని పిలిచేవారు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలో నటుడిగా పనిచేశాడు.[1]
- నటించిన సినిమాలు
- సీతాకల్యాణం (1934)
- కీచక వధ (1936) (కీచక పాత్ర)
- మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం (1936) (దుర్యోధనుడి పాత్ర)
- ద్రౌపదీ మానసంరక్షణం (1936) - శిశుపాలుడు
- చిత్రనళీయం (1938) (శాపానికి ముందు నలుడి పాత్ర)
మూలాలు
[మార్చు]- ↑ నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14