పిల్లలమర్రి సుందరరామయ్య
Appearance
పిల్లలమర్రి సుందరరామయ్య | |
---|---|
జననం | 1895 తెనాలి, గుంటూరు జిల్లా |
మరణం | 1933 |
వృత్తి | రంగస్థల నటుడు |
తల్లిదండ్రులు |
|
పిల్లలమర్రి సుందరరామయ్య (1895 - 1933) ప్రముఖ రంగస్థల నటుడు.[1]
జననం
[మార్చు]సుందరరామయ్య 1895లో కుమారస్వామి, శేషమాంబ దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలి లో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]చిన్నప్పటినుండి నాటకరంగంపై ఆసక్తివున్న సుందరరామయ్య నటననే వృత్తిగా స్వీకరించాడు. తెనాలి రామవిలాస సభలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. అక్కడ మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, గోవిందరాజుల వెంకటసుబ్బారావు, పెద్దిభొట్ల వేంకటాచలపతి, స్థానం నరసింహారావు, ముదిగొండ లింగమూర్తి తదితర ఉద్దండ నటులు సుందరరామయ్యకు సహచర కళాకారులు.[2]
నటించిన పాత్రలు
[మార్చు]- జనార్ధనమంత్రి
- నారదుడు
- రాంసింగ్
- హరిశ్చంద్రుడు
- పాపారాయుడు
- భీముడు
- నరకాసురుడు
- రుక్మాంగదుడు
- బిల్వమంగళ
- రాజరాజనరేంద్రుడు
- విశ్వామిత్రుడు
- సుదేవ
- అశ్వత్థామ
మరణం
[మార్చు]ఈయన 1933లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.647.
- ↑ సవ్వడి. "తెలుగు నాటక ప్రస్థానం". www.savvadi.com. నండూరి రవిశంకర్. Archived from the original on 30 డిసెంబరు 2018. Retrieved 11 February 2018.