Jump to content

సుమ సుధీంద్ర

వికీపీడియా నుండి
సుమ సుధీంద్ర
తరంగిణి వీణతో సుమ సుధీంద్ర
వ్యక్తిగత సమాచారం
జననంభారతదేశం
మూలంకర్ణాటక, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిసంగీతజ్ఞురాలు, వైణికురాలు
వాయిద్యాలువీణ

సుమ సుధీంద్ర కర్ణాటక శాస్త్రీయ సంగీత వీణావాద్య కళాకారిణి. ఈమె కళాప్రదర్శకురాలు, గురువు, పరిశోధకురాలు, నిర్వాహకురాలు.

ప్రారంభ జీవితం, వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె రాజారావు, చిట్టిబాబుల వద్ద సంగీత శిక్షణ పొందింది.

ఈమె బెంగళూరులో నివసిస్తున్నది. ఈమె భర్త దంతవైద్యుడు. ఈమెకు ఇద్ద్రు కుమార్తెలు ఉన్నారు.[1] ఈమెకు బోన్సాయ్‌ చెట్ల పెంపకంలో ఆసక్తి ఉంది.[2]

వృత్తి

[మార్చు]

ఈమె అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేసియా దేశాలలో విస్తృతంగా పర్యటించి వీణాగాన కచేరీలు నిర్వహించింది. ఈమె అనేక సంగీత గోష్టులను నిర్వహించింది.[3]

తరంగిణి వీణ

[మార్చు]

ఈమె సరస్వతి వీణలో మార్పులు చేసి తరంగిణి వీణ అనే వాద్యాన్ని సృష్టించింది.

కర్ణాటక జాజ్ సమ్మేళనం

[మార్చు]

ఈమె డచ్ జాజ్ గ్రూపు సినిఫెక్స్‌తో కలిసి అనేక కర్ణాటక జాజ్ సంగీత సమ్మేళనాలను నిర్వహించింది.[4]

ఇతర కార్యక్రమాలు

[మార్చు]

ఈమె సెంటర్ ఫర్ ఇండియన్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అనే సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నది. ఈ మ్యూజియమ్‌లో ప్రతి ఒక్కరు సంగీతాన్ని సృశించి, అనుభవించవచ్చు.[5]

ఈమె కూచిపూడి నృత్యకళాకారిణి వీణామూర్తి విజయ్‌తో కలిసి ఆర్టిస్ట్స్ ఇంట్రాస్పెక్టివ్ మూవ్‌మెంట్(AIM) అనే సంస్థను స్థాపించింది. దీనిద్వారా 2007 నుండి బెంగళూరు ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్ (BIAF)ను నిర్వహిస్తున్నది.[6]

పురస్కారాలు, సత్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Chandaraju, Aruna (30 May 2009). "Fusion is not just mere confusion". Deccan Herald. Retrieved 17 March 2015.
  2. "Small is beautiful". Deccan Herald. 25 January 2013. Retrieved 17 March 2015.
  3. Ramkumar, Madhavi (10 October 2013). "Synchronised strings". Bangalore. Retrieved 17 March 2015.
  4. Mazumdar, Subhra (4 March 2012). "A different melody altogether". Deccan Herald. Retrieved 17 March 2015.
  5. Madhukar, Jayanthi (27 October 2013). "Touch, feel and make music". Bangalore mirror. Retrieved 17 March 2015.
  6. "City gears up for arts fest". The Hindu. 19 September 2013. Retrieved 17 March 2015.
  7. "Rajyotsava awards for ace barber, IAS topper". Bangalore. The Times of India. 30 Oct 2001. Retrieved 17 March 2015.
  8. DHNS, Bengaluru (21 June 2018). "Sangeet Natak Akademi award to 3 from Karnataka". Deccan Herald. Retrieved 28 March 2021.