చిట్టిబాబు (వైణికుడు)
చిట్టిబాబు | |
---|---|
జననం | చల్లపల్లి హనుమాన్ పంతులు 1936 అక్టోబరు 13 |
మరణం | 1996 ఫిబ్రవరి 9 | (వయసు 59)
వృత్తి | సంగీతము,కర్ణాటక సంగీతము,సంగీత వాద్యమువీణ |
వెబ్‌సైటు | http://www.veenachittibabu.org |
చిట్టి బాబు (అక్టోబరు 13, 1936 - ఫిబ్రవరి 9, 1996) ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. కర్ణాటక సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రముఖ వైణికులలో ఇతనొకడు. ఇతని గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు.
బాల్యము, జీవిత గమనము
[మార్చు]చల్లపల్లి చిట్టిబాబు 1936 అక్టోబరు 13 న కాకినాడలో సంగీతాభిమానుల ఇంట పుట్టాడు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5 యేళ్ళ వయసులోనే వీణను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసాడు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ ఎయ్యుని అప్పలాచార్యులు, పండ్రవడ గారి వద్ద శిష్యరికం చేసాడు. తరువాత మహామహోపాధ్యాయ డా॥ఈమని శంకరశాస్త్రి వద్ద ముఖ్య శిష్యుడయ్యాడు.
ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతిలో సుస్థిరస్థానాన్ని పొందాడు. ఆయన 'కోయిలా గీతావిన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణా వాదన విన్యాస కళపై లఘుచిత్రం 'కళాకోయిలా అన్నది కూడా మరువలేని సాక్ష్యం కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడా వహించడం విశేషం. ప్రముఖ నిష్ణాత సభ్యుల సంఘం - శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ, తిరువాయూర్ లో సభ్యత్వం, శ్రీ కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసకత్వం, చిట్టిబాబు ప్రతిభాసిగలో . చిట్టిబాబును ఆవరించిన అసంఖ్యాకమైన పురస్కారాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం (1981-87) కలికి తురాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ (1984), సంగీత నాటక అకాడమీ పురస్కారం (1990) ను పొందారు 1948లో చిట్టిబాబును సినిమాలలో నటింపచేయాలని, కుటుంబం మద్రాసుకు వలసపోయారు. లైలా మజ్నూ చిత్రంలో బాలనటుడిగా వేశం వేసాడు కూడా. మరో చిత్రంలో చిన్న పాత్ర వేసాడు. అయితే, చిట్టిబాబుకు సంగీతం మీదే మక్కువ ఎక్కువయింది. అందుకని ఈమని శంకర శాస్త్రి వద్ద సంగీత సాధన మొదలుపెట్టి, ఎన్నో పద్ధతులు, సూక్ష్మభేదాలు నేర్చుకున్నాడు.
సినిమా కళాకారుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా
[మార్చు]ఆ రోజుల్లోని అందరు యువ కళాకారులలాగానే చిట్టిబాబు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. అందువలన ఆయన వీణ వాయించడమే, ఆయనకో గుణమయింది. 1948 నుండి 1962 వరకూ దక్షిణ భారత సినిమాలలో రికార్డింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసాడు. ఈ కాలంలోనీ సాలూరి రాజేశ్వర రావు, పెండ్యాల నాగేశ్వర రావు ఇంకా విశ్వనాథన్-రామమూర్తిల జోడీతో పని చేసే అవకాశం కలిగింది. ఆ కాలంలో వచ్చిన అన్ని ప్రముఖ పాటలనూ సూపర్ హిట్ చేయటంలో చిట్టిబాబు వీణ పాత్ర ఎంతో ఉంది. చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెంటిలోనూ ప్రతిభ చాటుకున్నాడు. కొన్ని ముఖ్యమయినవి:
- తమిళ సినిమా కలై కోవిల్కి సౌండ్‍ట్రాక్ అందించాడు. ఈ సినిమా నాయకుడి పాత్ర కూడా వైణికునిదే, సినిమా అంతటా నేపథ్య సంగీతం చిట్టిబాబు అందించాడు. ఈ సినిమా ఎందరి మన్నంలో పొందింది.
- తెలుగు సినిమా సంపూర్ణ రామాయణంకు టైటిల్ సౌండ్‍ట్రాక్‍గా రఘువంశ సుధా అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించాడు.
- సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన దిక్కట్ర పార్వతికి సంగీత దర్శకునిగా వ్యవహరించాడు.
- 1979లో కన్నడ చిత్రం శ్రీ రాఘవేంద్ర మహిమెకి సంగీతం అందించారు. ఇది తరువాత తెలుగులోకి డబ్ అయింది.
బిరుదులు, సత్కారాలు
[మార్చు]- వైణిక శిఖామణి - మైసూర్ మహారాజా వారిచే 1967లో ప్రదానం
- సప్తగిరి సంగీత విద్వన్మణి - తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే
- సంగీత చూడామణి - కృష్ణగాన సభ, మద్రాసు వారిచే
- కళాప్రపూర్ణ - 1984లో ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచే
- కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆవార్డు
- ఆస్థాన విద్వాంసుడు - కంచి కామకోటి పీఠం
- కలైమామణి - తమిళనాడు ప్రభుత్వం
- వైణిక సార్వభౌమ
- వీణాగాన ప్రవీణ
- గంధర్వ కళానిధి
- వైణిక సమ్రాట్
- వైణికరత్న
- తంత్రీవిలాస్
- కళారత్న మొదలైనవి
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగువారిలో సంగీతకారులు
- తెలుగు సినిమా సంగీత దర్శకులు
- 1996 మరణాలు
- 1936 జననాలు
- కర్ణాటక సంగీత విద్వాంసులు
- భారతీయ సంగీతకారులు
- తూర్పు గోదావరి జిల్లా సంగీత విద్వాంసులు
- తెలుగువారిలో వైణికులు
- మద్రాసు తెలుగువారు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు