సురేష్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1970 నుంచి 85 వరకు దూరదర్శన్‌లో వ్యాఖ్యాత.అమెరికా వాణిజ్య విభాగంలో సహాయ కార్యదర్శి.సికింద్రాబాద్‌లో జన్మించిన ఆయన ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, బాంబే వర్సిటీలో ఎంబీఏ చదివారు. కైజెన్‌ ఇన్నోవేషన్‌' సంస్థకు అధ్యక్షుడు.2006-07 మధ్య క్లింటన్‌ ఫౌండేషన్‌కు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు.ఆయన కుమారుడు ఆదిత్య కూడా శ్వేతసౌధంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.(ఈనాడు1.11.2009).యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫారిన్ కమర్షియల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌.జాన్సన్ అండ్ జాన్సన్ గ్రూప్ ఆపరేటింగ్ కమిటీలో పనిచేసిన అనుభవంతోపాటు.. వార్నర్ లాంబార్ట్, ఫైజర్‌లలో లాటిన్ అమెరికా వినియోగదారుల ఉత్పత్తుల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ సంయుక్త ప్రొఫెసర్‌గా కూడా పనిచేసిన కుమార్.. గ్లోబల్ మేనేజ్‌మెంట్‌పై పలు రచనలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ డిగ్రీ అందుకున్న కుమార్.. బాంబే యూనివర్సిటీలో ఎంబీఏను పూర్తి చేశారు. ప్రస్తుతం న్యూజెర్సీలోని ప్రిన్స్‌స్టన్‌లో నివసిస్తున్న ఈయన గతంలో ఆరు దేశాల్లో నివాసమున్నారు. ఆయా దేశాల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు http://telugu.webdunia.com/miscellaneous/nri/specialnews/0910/31/1091031093_1.htm.