సురేష్ కుమార్ కశ్యప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేష్ కుమార్ కశ్యప్
సురేష్ కుమార్ కశ్యప్


హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
పదవీ కాలం
22 జూలై 2020 – 23 ఏప్రిల్ 2023
ముందు రాజీవ్ బిందాల్
తరువాత రాజీవ్ బిందాల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు వీరేంద్ర కశ్యప్
నియోజకవర్గం సిమ్లా

వ్యక్తిగత వివరాలు

జననం (1971-03-23) 1971 మార్చి 23 (వయసు 53)
పప్లాహన్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు చాంబెల్ సింగ్జీ కశ్యప్, శాంతి దేవి కశ్యప్
జీవిత భాగస్వామి రజనీ సురేష్ కశ్యప్ (m.1997)
సంతానం 1 కొడుకు
వృత్తి రాజకీయ నాయకుడు

సురేష్ కుమార్ కశ్యప్ (జననం 23 మార్చి 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆ తరువాత 2019లో, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సురేష్ కుమార్ కశ్యప్ 23 మార్చి 1971న హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో చంబెల్ సింగ్ కశ్యప్, శాంతి దేవి దంపతులకు జన్మించాడు. ఆయన 1993లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బిఎ, ఆ తర్వాత 1995లో భారతీయ విద్యా భవన్ నుండి పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను, 1996లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ, సిమ్లాలోని HP విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎం ఫీల్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సురేష్ కుమార్ కశ్యప్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి బీజేపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ మోర్చా అధ్యక్షుడిగా, 2009లో బీజేపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. ఆయన 2012లో, 2017లో పచ్చాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సురేష్ కుమార్ కశ్యప్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిమ్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై[1] పార్లమెంట్‌లో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం మరియు న్యాయంపై స్టాండింగ్ కమిటీ, సభా సమావేశాలకు సభ్యుల గైర్హాజరుపై కమిటీ, విదేశీ వ్యవహారాల కమిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కోసం కాన్సులేటివ్ కమిటీల సభ్యుడిగా పని చేశాడు. ఆయన 22 జూలై 2020[2][3] నుండి 23 ఏప్రిల్ 2023 వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు .

ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిమ్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ సుల్తాన్‌పురిపై 91451 ఓట్లతో గెలిచి వరుసగా రెండుసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. India Today (24 May 2019). "BJP's Suresh Kashyap wins Shimla Lok Sabha seat" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  2. Rao, Madhu (2020-07-22). "Suresh Kashyap appointed new Himachal BJP chief". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-20.
  3. The Hindu (22 July 2020). "BJP names Shimla MP Suresh Kumar Kashyap as its Himachal president" (in Indian English). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  4. CNBCTV18 (4 June 2024). "Himachal Pradesh Election Result 2024: BJP secures all four seats in state" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)