Coordinates: 17°01′25″N 80°48′08″E / 17.023597°N 80.802119°E / 17.023597; 80.802119

సూరంపాలెం (చాట్రాయి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూరంపాలెం, కృష్ణా జిల్లా చాట్రాయి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సూరంపాలెం
—  రెవిన్యూయేతర గ్రామం  —
సూరంపాలెం is located in Andhra Pradesh
సూరంపాలెం
సూరంపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°01′25″N 80°48′08″E / 17.023597°N 80.802119°E / 17.023597; 80.802119
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చాట్రాయి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 214
ఎస్.టి.డి కోడ్ 08598

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

సూరమ్మ చెరువు[మార్చు]

గ్రామములోని ఈ చెరువులో, ప్రభుత్వం ప్రవేశపీట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, పూడికతీత పనులను 2017,ఏప్రిల్-10న ప్రారంభించారు. పూడికమట్టిని రైతులు తమ పొలాలలకు ఎరువుగా తరలించుచున్నారు. ఇళ్ళలో మెరక చేయుటకుగూడా తీసికొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలలో ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామములో దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఆలయంలో 2015,ఫిబ్రవరి-23వ తేదీ, సోమవారం ఉదయం 10-22 గంటలకు, ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం యజ్ఞశాలలో శాంతిపూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సువర్చలాదేవి, ఆంజనేయస్వామివారల శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాలనుండి భక్తులు విచ్చేసారు. ఆడబడుచులకు పసుపు,కుంకుమలు ఇవ్వడానికి ఏర్పాటుచేయడంతో గ్రామంలో సందడి నెలకొన్నది. వేలాదిమంది భక్తులు తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.

ఈ ఆలయంలో ప్రతిష్ఠ ఉత్సవాలను 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారంనాడు నిర్వహించెదరు. ఉదయం హనుమాన్ చాలీసాతో ప్రారంభించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించెదరు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]