సెప్టెంబర్ 2006

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్తుత ఘటనలు | 2006 ఘటనలు నెలవారీగా - |జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2005 ఘటనలు
సెప్టెంబర్ 2006
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

పతాక శీర్షికలు


2006 సెప్టెంబర్ 12, మంగళవారం[మార్చు]

  • "రాజీనామా చేసేసా" - కేసీయార్: తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు దమ్ముంటే రాజీనామా చేసి కరీంనగర్‌ ఎంపీ స్థానానికి తనతో పోటీ పడాలని మంత్రి ఎం.సత్యనారాయణరావు సవాలు చేయడం, అలాగైతే నెలలోగా ఉప ఎన్నిక జరిగేలా చూస్తానని పీసీసీ అధ్యక్షుడు కేశవరావు వ్యాఖ్యానించడంతో నేటి ఉదయం కేసీఆర్‌ ఊహించని రీతిలో స్పందించారు. పార్లమెంటు సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో స్పీకర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కేకే వ్యాఖ్యను కాంగ్రెస్‌ సవాలుగా తాను స్వీకరిస్తున్నానని, దమ్ముంటే వారు కూడా ముందుకు రావాలని సవాలు విసిరారు. ఈనాడు

2006 సెప్టెంబర్ 11, సోమవారం[మార్చు]

  • కేసీయార్ కు మంత్రి ఎమ్మెస్ సవాలు: తెరాస నేత కె.చంద్రశేఖరరావుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి ఎం.సత్యనారాయణరావు నిప్పులు కక్కారు. సిద్దిపేట సభలో తనను దూషించినందుకు కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్‌ లోక్‌సభ బరిలో ఇద్దరం పోటీచేసి.. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం రావాలంటూ ఆయనకు సవాల్‌ విసిరారు. ఈనాడు
  • "నెలలో ఎన్నికలు పెట్టిస్తా" - కేకే: మంత్రులు ఎం.సత్యనారాయణరావు, షబ్బీర్‌ అలీలు ఎన్నికలకు సిద్ధం కావాలని తెరాస అగ్రనేతలకు సవాల్‌ విసరడం సబబేనని కేకే అన్నారు. 'ఎమ్మెస్‌ చాలా సీనియర్‌ నేత. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేసీఆర్‌ పుట్టిఉండడు. అంతగా బలం ఉందని చెప్పుకునేవాడు ఎమ్మెస్‌ సవాల్‌ను స్వీకరించవచ్చుగా! కేసీఆర్‌ దీనికి అంగీకరిస్తే.. నేను రేపే ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘంతో మాట్లాడతా. నెలరోజుల్లోగా ఉప ఎన్నికలు జరిగేలా చూస్తా' అని చెప్పారు. ఈనాడు

2006 సెప్టెంబర్ 8, శుక్రవారం[మార్చు]

  • తెలంగాణ సమర శంఖారావం: 'తెలంగాణ సమర శంఖారావం' పేరుతో మెదక్‌ జిల్లా సిద్దిపేటలో తెరాస ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీ జన సందోహాన్ని ఉద్దేశించి కేసీఆర్‌ ఆవేశపూరితంగా, ఉద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌పై నిప్పులు కురిపించారు. తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. ప్రాణాలు బలిపెట్టయినా తెలంగాణ సాధించి తీరతామని శపథం చేశారు. గత ఎన్నికల్లో తమ వల్లే తెరాస గెలిచిందన్న కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలమంతా రేపే రాజీనామాలు చేస్తాం. దమ్ముంటే... మీరూ రాజీనామా చేయండి. మళ్లీ ప్రజా తీర్పు కోరదాం. ఎవరి వల్ల ఎవరు గెలిచిండ్రో తేలిపోతది అంటూ సవాలు చేశారు. ఈనాడు
  • మహారాష్ట్ర లోని మాలేగావ్‌ (నాసిక్‌ జిల్లా) పట్టణంలో వరుసగా మూడు పేలుళ్లు జరిగాయి. 38 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారు. మధ్యాహ్నం రెండుగంటలకు కొన్ని నిముషాల ముందుగా ఓ మసీదు సహా మూడు వేర్వేరు చోట్ల ఒకేసారి పేలుళ్లు జరిగాయి. చనిపోయిన తమ బంధువులకు 'షబ్‌-ఎ-బరాత్‌' సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఒక వర్గం వారు శ్మశానంలో సమాధుల వద్ద గుమికూడిన సమయంలో పేలుళ్లు జరగడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈనాడు
  • మావోఇస్టుల కోసం తరలిస్తున్న రాకెట్ల పట్టివేత: మావోఇస్టుల కోసం తరలిస్తున్న ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే 875 రాకెట్లు, 36 లాంచర్లను పోలీసులు పట్టుకున్నారు. అదికూడా ఒక్కచోటకాదు. ఒకేరోజు రెండుచోట్ల. అవి.. తమిళనాడు, పుదుచ్చేరిలలో తయారయ్యాయి! 'మోటారు విడిభాగాలు'గా నెల్లూరు, చెన్నైల నుంచి కదిలాయి. 'క్రాంతి' ట్రాన్స్‌పోర్టు వారి వాహనాల్లో ప్రయాణించాయి. 17 బ్రాంచిల్లో బస చేసి... అంచెలు అంచెలుగా కదిలాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటకు చేరుకున్నాయి. మరికొన్ని ప్రకాశం జిల్లా గిద్దలూరులో పట్టుబడ్డాయి. ఇంకొన్ని గుంటూరు, కర్నూలు, నల్గొండ జిల్లాలకు తరలివెళ్లాయి. అన్నింటి గమ్యం... నల్లమల అడవులే! ఇవన్నీ మావోయిస్టుల కోసమే వెళ్తున్నాయని పోలీసులు ప్రకటించారు. దేశంలో ఈ స్థాయిలో పేలుడు పదార్థాలు బయటపడటం ఇదే మొదటిసారి. ఈనాడు